పితృ దోషం అంటే ఏమిటి..? కలిగే కష్టానస్టాలేమిటి..? చేయవలసిన పరిహారాలు ఇవే..
Mahalaya Paksham 2026: హిందూ సనాతన సంప్రదాయంలో ఎన్నో పూజలు, వ్రతాలాంటివి ఉన్నాయి. అందులో పితృ కార్యాలకు ప్రత్యేక స్థానం ఉంది.దీన్ని అపర కర్మలుగా పిలుస్తుంటారు. ఇక మనకు తెలియకుండానే కొన్ని పితృ దోషాలు మనల్ని వెంటాడుతుంటాయి. అందులో పితృ దోషం ఒకటి. మన కన్న తల్లిదండ్రులకు కానీ.. పిల్లకు కానీ ఎవరికైనా తెలిసో.. తెలియకో..ఇబ్బందులు కలిగిస్తాయి. అంతేకాదు మన పూర్వీకులు ఎవరో తెలిసో తెలియకో చేసిన పాపాలు.. వారి వారసులను పట్టి పీడుస్తుంటాయి. వాటినే పితృదోషాలుగా పిలుస్తాము.
Pitru Paksham 2026: పితృదోషాల వలన అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతుంటాయి. ఏ ఋణమైనా తీరవచ్చు కానీ.. మాత, పితరుల ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదని మన ధర్మ శాస్త్రం చెబుతున్న మాట. ఇక పితృ ఋణం నుండి ముక్తి పొందటం అంత తేలికైన విషయం కాదు.
తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత పరి తపిస్తారో చెప్పలేనిది. పితృ గణాల శ్రాద్ధ కర్మ చేయటం సంతానం ఒక్క విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో పాటు వాయురూపంలో భోజనం స్వీకరిస్తారనేది శాస్త్ర వచనం.
సూర్యుడు కన్యరాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వచ్చి వెళతారట. శ్రాద్ధం అంటే మనం శ్రద్ధతో చేసేదనేది శ్రాద్ధం అని పేరు వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య , పితరుల పుణ్య తిథిగా చెప్పబడింది. అందులో మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంది.
ఆ సమయంలో శ్రాద్ద కర్మ ను శ్రద్దగా ఆదర పూర్వకంగా ఆచరిస్తే.. తమ సంతానంతో పాటు వారి సంతతి వారు ఆయువు, ఆరోగ్యం, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారట.
అన్ని దానాల్లో అన్నదానం గొప్పది. ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ఇస్తుందనేది మన పురాణ గ్రంథాల్లో ఉంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాతాన్ని ఇస్తుందనేది శాస్త్రంలో ఉన్న మాట.
Disclaimer: ఈ కథనంలో పేర్కొనబడిన వ్యాసం పూర్తిగా మన హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల్లో ఉన్న వాటినే మేడు ప్రస్తావించాము. ఇది ఆయా వ్యక్తుల నమ్మకాల ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు ఈ వార్తను ధృవీకరించడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఆయా రంగాల్లోని నిపుణులైన పండితులను సంప్రదించి తగిన పరిహారాలను పాటించండి.