మహాలయ పక్షంలో పిండ ప్రధానాలు ఎందుకు చేయాలి..? పితృ పక్షం ప్రత్యేకత ఏమిటంటే..!
Mahalaya Paksham 2026: సనాతన హిందూ సంప్రదాయంలో ఆరో మాసమైన భాత్రపదంలో గణేష్ నవరాత్రులు పూర్తైన తర్వాత పున్నమి తర్వాతి రోజు నుంచి బహుళ పక్షంలో మన జన్మలకు కారణమైన పూర్వీకులకు తలచుకుంటూ వారికి పిండ ప్రధానాలు చేస్తుంటారు. అసలు ఈ పక్షం రోజుల్లో చేసే ఈ పిండ ప్రధానాలకు మాములుగా ప్రతి యేడాది తద్దినం రోజు పెట్టే పిండ ప్రధానికి తేడా ఏమిటి..?
Pitru Paksham 2026: భాద్రపద శుక్ల పాడ్యమి నుంచి వచ్చే 15 రోజులను పితృ దేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైనది. పెద్దలను మన మాత, పితృ దేవతలను స్మరిస్తూ చేసే పిండ ప్రధానాలను కాబట్టి ఈ పక్షం రోజులను పితృ పక్షంగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. పితృ పక్షాలు..మహాలయ పక్షం పెత్తన అమాసగా పెద్దల అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ పితృ పక్షాలు ఈనెల సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 10వ తేదీ మహాలయ అమావాస్యతో ఎండ్ అవుతాయి. ఈ పెద్దల అమావాస్య ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించుకోవాలి. ఇలా వారిని గుర్తు చేసుకోవడం వలన మనకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని మన ధర్మ శాస్త్ర గ్రంథాల్లో ఉంది. ఈ మహాలయ పక్షం రోజుల్లో చేసే శ్రాద్ద కర్మలతో మనం వంశం అభివృద్ది చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.
బహుళ పక్షం..
భాద్రపదలో శుక్లపక్షంలో గణపతి మహోత్సవాల తర్వాత వచ్చే బహుళ పక్షం పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ పదిహేను రోజులకు వారికి మాత్రమే కేటాయించబడింది. ఈ పక్షం ముగిసే వరకు ప్రతి రోజూ పితృదేవతలకు క్రమం తప్పకుండా తర్పణ, శ్రాద్ధ విధులను తెలిసిన వాళ్లు శాస్త్రోస్తకంగా నిర్వహిస్తూ ఉండాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి ఏదైతే ఉందో ఈ రోజున పిండ ప్రధానం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ తిథి రోజు వీలు కాకపోతే.. అమావాస్య రోజున శ్రాద్ధం పెట్టాలట.
నాన్న జీవించి, అమ్మ కన్నుమూస్తే.. ఈ పక్షంలో నవమి నాడు తర్పణ చేయాలి. శ్రాద్ధ విధులను ఆచరించాలని శాస్త్రం చెబుతున్న మాట. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాల్సిందే. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజైన అక్టోబర్ 10 వ తేది రోజున తర్పణం వదలాలి.
కర్ణుడి ఆకలి తీరలేదు..
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి కన్నుమూసిన తర్వాత స్వర్గానికి వెళ్లాడట. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పికలు కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామనుకున్నాడు. కానీ ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయిందట. ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే బంగారం అయిపోయింది. ఇలా లాభం లేదనుకుని కనీసం దాహం తీర్చుకుందామని అక్కడున్న చెరువను నీటిని దోసిట్లో తీసుకొని నోటి ముందు పెట్టుకోవడమే ఆలస్యం అది కూడా స్వర్ణమయం అయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి. దాంతో కర్ణుడు తాను చేసిన తప్ప ఏమిటి.. ? తనలో తాను మదన పడ్డాడట. తనకిలా ఎందుకు జరుగుతున్నదని ఆలోచిస్తూ ఉండగా.. కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదని ఆశీరవాణి పలికింది. అందుకే నీకీ పరిస్థితి వచ్చిందన్నారు.
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి దీనికి ప్రాయశ్చితం అడిగాడు. ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
అపుడు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ నిరుపేదలు,బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితృ దేవతలకు తర్పణలు వదిలి శ్రాద్ధ కర్మలు చేసి తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లినట్టు మన ధర్మశాస్త్రాల్లో ఉంది.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఆకలి తీరి పోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షంగా పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పెత్తన అమాసనగా పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కులాలకు,మతాలకు అతీతంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో, గురువుల్లో మరణించిన మీ మీ పితృదేవతలకు తిలా శ్రాద్ధం కానీ అన్న శ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొందాలనేది శాస్త్ర వచనం. దీని వలన మీ వంశాభివృద్ధికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
Disclaimer: ఈ కథనంలో పేర్కొనబడిన వ్యాసం పూర్తిగా మన హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల్లో ఉన్న వాటినే మేము ప్రస్తావించాము. ఇది ఆయా వ్యక్తుల నమ్మకాల ఆధారపడి ఉంటుంది. జీ మీడియా ఈ వార్తను ధృవీకరించడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం