SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karthika masam: కార్తీక మాసంలో భార్య భర్తలు సంభోగంలో పాల్గొనవచ్చా..?.. అసలు నిజం ఏమిటంటే .!.

Karthika masam vratam: కార్తీక మాసంలో చాలా మంది దీపదానాలు, నదీస్నానాలు చేస్తారు.ఈ నెలలో చేసే వ్రతాలు, పూజలు అనంతమైన శుభ ఫలితాల్ని ఇస్తాయి.

Written By Inamdar Paresh
Published: Nov 12, 2026, 03:50 PM IST | Updated: Nov 12, 2026, 03:57 PM IST
Image Credit: karthikamasam rules(file)
Join

Karthika masam couple mating facts: కార్తీక మాసంను శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్తారు.ఈ నెల రోజుల పాటు మనం చేసే వ్రతాలు, పూజలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలు ఇస్తాయి.  కార్తీకమాసం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు దీపదానం, ఆకాశ దీపం, సత్య నారాయణ వ్రతాలు మొదలైనవి ఆచరిస్తారు.ఈ నెల రోజుల పాటు ప్రత్యేకంగా కార్తీక సోమవారం, శుక్రవారం, శనివారాలకు అత్యంత   ప్రాధాన్యత ఉందని చెప్తారు. 

మనం ఈసారి నవంబర్ 16న మొదటి కార్తీక సోమవారంను జరుపుకుంటాం. నవంబర్ 19 నుంచి దశమి నుంచి 24 కార్తీక పౌర్ణమి వరకు ప్రత్యేకంగా శివ, వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాల్ని కూడా నిర్వహిస్తారు. అయితే.. పవిత్రమైన కార్తీక మాసంలో చాలా మంది మద్యం, మాంసాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మొదలైన వాటిని త్యజిస్తారు. నెల రోజుల పాటు శివ, కేశవుల్ని అత్యంత భక్తితో పూజించుకుంటారు.

అయితే కార్తీక మాసంలో నెల రోజులు పాటు కొత్తగా పెళ్లైన జంటలతో పాటు, భార్య భర్తలు సంభోగం చేయకూడదని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలో వ్రతాలు, దీక్షలు, నియమాలు పెట్టుకుంటే మాత్రమే ఆ సమయంలో భార్యభర్తలు శారీరకంగా కలవకూడదని జ్యోతిష్య పండితులుచెబుతున్నారు. ఒకవేళ పైన విధంగా ఎలాంటి విధమైనవి లేకుంటే భార్యభర్తలు దాంపత్య జీవితంలో భాగంగా సంభోగంలో కలవొచ్చని చెబుతున్నారు.   కార్తీక మాసంలో సంభోగం జరిపితే ఈ శుభమూహుర్తాలు, శుభఘడియల ప్రభావం వల్ల మంచి సంతానం కల్గుతారని కూడా పెద్దలు చెబుతుంటారు. అందుకే దీనిపైన సందేహాలు వద్దని సూచిస్తున్నారు.

అంతే కాకుండా దాంపత్య జీవనం అనేది సహాజమైనదని, ధర్మబద్దమైనదని దీనికి ఎలాంటి దోషంలేదని పండితులు చెబుతున్నారు. ఇది ఒక గొప్ప సృష్టికార్యమని దీనికి తప్పు అనే భావనతో చూడకూడదని పండితులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల రోజులు పాటు దైవరాధన, గోసేవ, పేదలకు అన్న, వస్త్రదానాలు, మొదలైనవి చేస్తే అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ( గమనిక - ఈ స్టొరీ కేవలం నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES