• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘రామాయణ’ పేరిట మరో రేర్ ఫీట్.. ఫస్ట్ వీక్ ఇండియన్ సినిమాల్లో అరుదైన ఘనత..

‘రామాయణ’ పేరిట మరో రేర్ ఫీట్.. ఫస్ట్ వీక్ ఇండియన్ సినిమాల్లో అరుదైన ఘనత..

Ramayana 1st Week Box Office Collection: దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ సినిమా పూటకో రికార్డును తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా 7వ రోజు బాక్సాఫీస్ దగ్గర అరుదైన రికార్డును నమోదు చేసింది. మొత్తంగా వెండితెర పై శ్రీరాముడు బాక్సాఫీస్ అశ్వమేథం నడుస్తున్నట్టుగా సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 04:59 PM IST|Updated: Nov 12, 2026, 05:02 PM IST
joinshare
‘రామాయణ’ పేరిట మరో రేర్ ఫీట్.. ఫస్ట్ వీక్ ఇండియన్ సినిమాల్లో అరుదైన ఘనత..
Image Credit: Ramayana Rare Feet (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India Inflation Rate: సామాన్యులకు మరో షాక్.. 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం..!

India Inflation Rate: సామాన్యులకు మరో షాక్.. 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం..!

2

MP Rasgulla Bomb: వామ్మో.. నోట్లో పెట్టగానే బాంబులా పేలిన రసగుల్లా.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

3

డబ్బు ఆశ చూపి 43 మంది మహిళలకు వల.. అసలు గుట్టు బయటపెట్టిన పోలీసులు..!

4

Yadadri Temple: యాదగిరిగుట్ట బస్టాండ్ లో నాగు పాము కలకలం.. ప్రయాణికులు పరుగో పరుగు.!. చివరకు ఏంజరిగిందంటే..?..

5

1300 Dharani Rice In AP: సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana Epic Record: ‘రామయణ’ సినిమాపై గత కొన్నేళ్లుగా పాజిటివ్‌గానో.. నెగిటివ్‌గానో ఏదో ఒక టాక్ నడుస్తూనే ఉంది. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉన్నా.. ఇది రామాయణం కాదు.. రావణాయం అని  కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినా.. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మర్యాద పురుషోత్తముడు  శ్రీరాముడు గురించే కాకుండా.. రావణాసురుడి గురించి ఎంతో చెప్పారు. ఆయన ఎంత శక్తివంతుడైన రాజును శ్రీరామ చంద్రుడు ఎలా ఓడించి దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ చేసారు. అసలు రామాయణంలో రావణాయంతో పాటు సీతాయణం, లక్ష్మణాయణం కూడా ఉంది. ఓ రకంగా రామాయణంలో ఎక్కువగా ఈ నాలుగు పాత్రలే చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే రావణుడు ఎలాంటి వాడు.. ఎంతటి శక్తివంతుడనేది చూపేస్తేనే కదా.. శ్రీరాముడి పరాక్రమం తెలిసేది. ఏది ఏమైనా ‘రామాయణ’ సినిమాలో ఒకటి రెండో లోటు పాట్లు ఉన్నా.. దాన్ని భూతద్దంలో పెట్టి వెతకాల్సిన పనిలేదు.

ఈ సినిమా వరుసగా 7 రోజులు ప్రపంచ వ్యాప్తంగా  బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. మన దేశంలో మరే సినిమా వరుసగా వారం రోజులు రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్డిన చిత్రాలు మరొకటి లేదు. ఈ రకంగా శ్రీరాముడు తన ‘రామాయణ’ పేరిట బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడనే చెప్పాలి.

డే వైజ్ బాక్సాఫీస్ వసూళ్లు.. 

ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 151 కోట్లు.. రెండో రోజు రూ. 110 కోట్ల గ్రాస్.. థర్డ్ డే  రూ. 160.25 కోట్లు.. నాల్గవ రోజు రూ. 128.60 కోట్లు.. సోమవారం ఐదో రోజు  ఏకంగా రూ. 160కోట్ల గ్రాస్.. ఆరో రోజు రూ. 155 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఏడో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

ఫస్ట్ వీక్ హిందీ నెట్ వసూళ్లు.. 

మొదటి రోజు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 47 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు  రూ. 38.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. శనివారం నరక చతర్ధశి రోజు రూ. 53కోట్ల నెట్.. ఆదివారం దీపావళి రోజున కేవలం 37 కోట్లు. సోమవారం ఐదో రోజు రూ. 95 కోట్ల నెట్ వసూల్లు..  ఆరో రోజు రూ. 75.03 కోట్ల నెట్ వసూల్లు.. రూ. 61.10 కోట్ల నెట్ వసూల్లు సాధించింది.  మొత్తంగా హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 409.56 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 934.55 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. 8వ రోజుతో ఈ సినిమా రూ. 1000 కోట్ల ఎలైట్‌ క్లబ్బులో ప్రవేశించే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. 

రామాయణ ప్రీ రిలీజ్ బిజినెస్.. 

ప్రపంచ వ్యాప్తంగా రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 800 కోట్ల వరకు జరిగింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ. 1600 కోట్ల గ్రాస్, రూ. 800 కోట్ల షేర్ రాబట్టాల్సిన  అవసరం ఉంది. ఇప్పటి వరకు 935 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. మరో రూ. 625 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie