• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Dhanatrayodashi: ధన త్రయోదశి వేళ యమదీపం విశిష్టత..?.. నియమాలు..?.. ఏ సమయంలో వెలిగించాలి..?

Dhanatrayodashi: ధన త్రయోదశి వేళ యమదీపం విశిష్టత..?.. నియమాలు..?.. ఏ సమయంలో వెలిగించాలి..?

Yama deepam 2026: యమదీపంను వెలిగించడం వల్ల ఇంట్లోని వారందరికి అపమృత్యు దోషాలు అన్ని తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

Written ByInamdar Paresh
Published: Nov 06, 2026, 12:46 PM IST|Updated: Nov 06, 2026, 12:56 PM IST
joinshare
Dhanatrayodashi: ధన త్రయోదశి వేళ యమదీపం విశిష్టత..?.. నియమాలు..?.. ఏ సమయంలో వెలిగించాలి..?
Image Credit: yamadeepam(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
బెండకాయతో ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా వేస్ట్టే!

బెండకాయతో ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా వేస్ట్టే!

2

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

3

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

4

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

5

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yama deepam 2026 date muhurat rituals tradition: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా దీపావళి పండగను మూడు రోజులు పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి మనం నవంబరు 6 నుంచి మూడు రోజుల పాటు  ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండగల్ని మనం జరుపుకుంటాం. అనాదీగా ధన త్రయోదశి రోజున యమదీపంను వెలిగించడంను సంప్రదాయంగా పాటిస్తున్నారు.  ఈసారి ధన త్రయోదశి అనేది నవంబర్ 6న  ఉదయం 11 గంటలకు వచ్చి మరుసటి రోజున అంటే నవంబర్ 7న ఉదయం 10.30 వరకు ఉండటం వల్ల రెండు రోజులు కూడా ధన త్రయోదశిని జరుపుకొవచ్చు .

ఈ రోజున కొంచెమైన బంగారం కొనుగోలు చేయాలని కొంత మంది నియమంగా పాటిస్తారు. ఇక యమదీపం అనేది తప్పకుండా వెలిగించాలని పండితులు చెబుతున్నారు.  నవంబరు 6 ప్రదోష  సమయంలో లేదా శనివారం బ్రాహ్మీమూహుర్తంలో అయిన యమదీపం వెలిగించుకొవచ్చు..

యమదీపం ఎలా వెలిగించాలి..

గోధుమ పిండి తీసుకుని దానిలో పసుపు నీళ్లు వేసి ముద్దులా చేసుకొవాలి. ఆతర్వాత ఇంటి గుమ్మం ప్రధాన ద్వారంకు కుడివైపున నెల మీద శుభ్రం చేసి అష్టాదళ పద్మం ముగ్గువేయాలి. దాని మీద 8 తమలపాకులు పెట్టాలి. ఆ తర్వాత బియ్యం లేదా ఉప్పును వేయాలి. దాని మీద గోదుమ పిండితో చేసిన దీపంను పెట్టాలి. వత్తిని ఎర్రగా చేసి నువ్వుల నూనె పోసి దీపంను వెలిగించాలి. దానిలో ఒక రాగి లేది ఇత్తడి కాయిన్ వేయాలి. ఆ దీపం కింద నల్లని నువ్వులు వేయాలి.  

దీపం ముఖం దక్షిణం వైపు ఉండేలా చూసుకొవాలి. దక్షిణం వైపుకు అధిపతి సూర్యపుత్రుడు యముడు. అందుకే ఆయన అనుగ్రహం కోసం యమదీపంను దక్షిణం వైపుకు వెలిగించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ముఖ్యంగా ఇంట్లోని పెద్దవారు  ఈ యమదీపంను వెలిగించాలని  దీని వల్ల  ఇంట్లో వారి అపమృత్యు  దోషాలన్ని పోతాయని అనాదీగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals
Astrological Remedies
Trending News
Telugu News
Vastu Tips