SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs Japan: సుజుకి కప్ మనదేనా..? రేపే జపాన్‌తో భారత్‌ చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌

All Set To Tomorrow India vs Japan One T20 Match: అగ్ర జట్లతో తలపడే భారత జట్టు తొలిసారి జపాన్‌తో ఆడేందుకు సిద్ధమైంది. రేపు ఆతిథ్యమిస్తున్న జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ప్రత్యర్థి గడ్డపై భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 07:05 PM IST | Updated: Sep 21, 2026, 07:18 PM IST
Image Credit: India vs Japan T20 Match
Join

India vs Japan T20I: భారత క్రికెట్‌ జట్టు రేపు అత్యంత ఆసక్తికర టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అగ్ర జట్లతో సమవుజ్జీగా ఉండే భారత జట్టు మంగళవారం జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్‌లో తలపడనుంది. ఆతిథ్యమిస్తున్న జపాన్‌ను చిత్తు చేసి విజయ పతాకం ఎగురవేస్తుందా? క్రికెట్‌పరంగా అంతగా అనుభవం లేని జపాన్‌తో ఏ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు భారత్‌, జపాన్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

భారతదేశం- జపాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల రెండు దేశాలకు చెందిన క్రికెట్‌ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌ నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ‘స్పోర్ట్‌-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారత్‌, జపాన్‌ మధ్య క్రీడల అభివృద్ధికి సహకారం కోసం ఈ మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రేపు ఇరు జట్లు తలపడబోతున్నాయి.

శ్రేయస్‌ అయ్యర్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే జపాన్‌కు చేరుకుంది. అయితే సోమవారం ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆటగాళ్లు ఎవరూ కూడా గ్రౌండ్‌లోకి దిగకుండా హోటల్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో రద్దయ్యింది. అయితే క్రికెట్‌పరంగా జపాన్‌ అత్యంత చిన్నజట్టు కావడంతో భారత ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ అవసరం లేదు. ఇటీవల జింబాబ్వే, అఫ్గానిస్తాన్‌లతో జరిగిన సిరీస్‌లను క్లీన్‌స్వీప్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత జట్టు ఉంది. ఈ నేపథ్యంలో జపాన్‌ను ఎదుర్కోవడం మనోళ్లకు పెద్ద సవాలు కాదు.

ఇది గొప్ప మ్యాచ్‌: కెప్టెన్‌
ఈ మ్యాచ్‌ సందర్భంగా జపాన్‌ రావడంతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. 'జపాన్ ప్రభుత్వం అద్భుత స్వాగతం పలికింది. జపాన్‌త్‌ క్రికెట్ మ్యాచ్‌ మాకు చాలా ఉత్కంఠ, ఉత్తేజకరంగా ఉంది. జపాన్‌తో ఆడడం ఇదే తొలిసారి కావడంతో ఇక్కడి పిచ్ పరిస్థితి, వికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ ఒక గొప్ప మ్యాచ్ ఆడేందుకు మాత్రం ఎదురుచూస్తున్నాం’ అని శ్రేయస్‌ అయ్యర్‌ వీడియోలో తెలిపాడు.

మ్యాచ్‌ విశేషాలు
రెండు జట్ల మధ్య జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ ఇది
ఈ మ్యాచ్‌కు సుజుకి కప్ అని నామకరణం
వేదిక: సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
సమయం: రేపు ఉదయం 9.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం)

భారత జట్టు అంచనా
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శామ్‌సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వైభవ్ సూర్యవంశీ, యష్ ఠాకూర్, విప్రజ్ నిగమ్

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES