SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ankush Panghal: సుభాష్‌ చంద్ర ఫ్యాక్టరీ నుంచే ఆసియా క్రీడల 'బాక్సింగ్‌ బంగారం' అంకుష్‌ పంఘల్‌

Asian Games 2026 Boxing Gold Winner Ankush Panghal Is A Student Of Subhash Chandra Foundation: ఎంతో మంది మట్టిలోని మాణిక్యాలను తయారుచేసిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ నుంచే మరో క్రీడాకారుడు ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టించాడు. ఆ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన క్రీడాకారుడు అంకుష్‌ పంఘల్‌ ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫున బాక్సింగ్‌లో తొలి స్వర్ణం సాధించాడు. స్వర్ణ పతక విజేత అంకుష్‌ పంఘల్‌ నేపథ్యం తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 02, 2026, 08:30 PM IST | Updated: Oct 02, 2026, 08:34 PM IST
Image Credit: Source: Subhash Chandra Foundation Instagram
Join

Subhash Chandra Foundation: భారత క్రీడా రంగానికి సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఎంతో మంది మట్టిలోని మాణిక్యాలను వెలికితీయగా వారంతా అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్టను చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫౌండేషన్‌లోనే శిక్షణ పొందిన మరో క్రీడాకారుడు ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన చేసి తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో పోటీపడిన అంకుష్‌ పంఘల్‌ తుది పోరులో ప్రత్యర్థిని మట్టి కరిపించి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఆసియా క్రీడల బాక్సింగ్‌ చాంపియన్‌ అంకుష్‌ పంఘల్‌ నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.

హర్యానాలోని గంగ్వా గ్రామంలో ఏర్పాటుచేసిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ క్రీడాకారుల అడ్డాగా కీర్తి పొందుతోంది. ఈ ఫౌండేషన్‌లోని బాక్సింగ్ శిక్షణా కేంద్రం నుంచి శిక్షణ పొందిన అంకుష్‌ పంఘల్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఈ ఫౌండేషన్‌లో ఎన్నో మెలకువలు నేర్చుకుని.. రాటుదేలిన 21 ఏళ్ల అంకుష్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌ నుంచి తొలి స్వర్ణ పతకాన్ని అంకుష్‌ పంఘల్‌ సాధించాడు.

హర్యానాలోని హిసార్‌కు చెందిన బాక్సర్ అంకుష్ పంఘల్ 2026 ఆసియా క్రీడల్లో పురుషుల 80 కిలోల విభాగంలో పోటీపడ్డాడు. జపాన్‌లో శుక్రవారం జరిగిన ఆసియా క్రీడల ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సియోంగ్‌తో తలపడిన అంకుష్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 4-0 తేడాతో చిత్తు చేశాడు. సుభాష్ చంద్ర ఫౌండేషన్ బాక్సింగ్ శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొంది.. అక్కడ నేర్చుకున్న మెలకువలు ఆసియా క్రీడల్లో చూపించాడు. ఫలితంగా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో అంకుష్‌ పంఘల్‌ మట్టికరిపించాడు. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిలకడగా రాణిస్తూ ఇప్పుడు ఆసియా క్రీడల్లో బంగారు కొండగా మారాడు.

అంకుష్‌ నేపథ్యం
హర్యానాలోని హిసార్ జిల్లా బెరియాలో 13 ఆగస్టు 2005 జన్మించిన అంకుష్‌ మొదటి నుంచి బాక్సింగ్‌పై మక్కువ చూపేవాడు. టీనేజ్‌కు వచ్చేవరకు అంకుష్‌ బాక్సింగ్‌లో రాటుదేలాడు. పురుషుల 80 కిలోల వెయిట్ కేటగిరీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న అంకుష్‌ ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో మెరిశాడు. రింగ్‌లో వేగవంతమైన కదలిక, ఎదురుదాడి, బౌట్ సమయంలో వ్యూహాలను మార్చగల సామర్థ్యం అంకుష్‌ బలాలుగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే ఆసియా క్రీడల్లో మెరవడం వెనుక సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ పాత్ర ఎంతో ఉంది.

 న్యూఢిల్లీ వేదికగా 2025లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 80 కిలోల విభాగంలో అంకుష్‌ పోటీపడి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ ఒలాడెమిజి షిట్టు చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అంకుష్‌ సామర్థ్యం పెరిగింది. 2026లో అంకుష్ తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకున్నాడు. జూలైలో చెకియా వేదికగా జరిగిన ఉస్తి నాడ్ లాబెం గ్రాండ్ ప్రిక్స్‌లో 80 కిలోల విభాగంలో అంకుష్‌ తలపడి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అనంతరం తాజాగా గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో 80 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలవడం అంకుష్‌ పంఘల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన. 2026 ఉస్టీ నాడ్ లాబెం గ్రాండ్ ప్రిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న అంకుష్‌ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం పొందాడు.

ఆసియా క్రీడల్లో అంకుష్‌ ప్రయాణం
ఆసియా క్రీడల్లో ఆరంభం నుంచే అంకుష్‌ ప్రయాణం అద్భుతంగా సాగింది. క్వార్టర్ ఫైనల్స్‌లో తజికిస్తాన్‌ బాక్సర్‌ నెక్రజ్ సలీమోవ్‌ను 0-5 తేడాతో అంకుష్‌ ఓడించాడు. ఈ విజయంతో పతకం ఖరారు చేసుకున్న అంకుష్‌.. సెమీఫైనల్స్‌లో ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్‌ ఫజ్లిద్దీన్ ఎర్కిన్‌బోయెవ్‌తో తలపడ్డాడు. 1-4 తేడాతో సెమీఫైనల్‌లో గెలిచి అంకుష్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES