Asian Games 2026 Team India Record: ఆసియా క్రీడలు 2026ల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. అయితే ఈ గెలుపుతో టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టీమ్ఇండియా సరికొత్త రికార్డును సాధించింది.
Asian Games 2026 Indian Team: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు రాణిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను కేవలం 45 పరుగులకే చిత్తు చేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు, పాకిస్థాన్‌తో బంగారు పతకం కోసం పోటీ పడనుంది.
Asian Games 2026 Team India: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లేవీ జరగకుండానే రద్దయ్యాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉన్న ప్రాతిపదికన టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లభించకపోయినా టోర్నీలో ముందంజ వేసింది. ఒకవేళ ప్రతికూల వాతావరణం వల్ల సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకునే లేదా ఉమ్మడిగా పంచుకునే అవకాశం ఉంది.
Asian Games 2026 Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఏమాత్రం గురి తప్పకుండా ఒకే రోజులో హ్యాట్రిక్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశానికి ఘనమైన విజయాన్ని అందించారు. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాల్లో తెలుగు అమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు కీలక పాత్ర పోషించగా, డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన పురుషుల జట్టు కూడా తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.
Asian Games India Semis 2026: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు టీమ్ఇండియా ఇటీవలే జపాన్ చేరుకుంది. అయితే ఈ టోర్నీలో భాగంగా క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు ఆడాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దైంది. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉన్న టీమ్ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Team India Japan Bullet Train: జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టోక్యో నుంచి టీమ్ఇండియా బయల్దేరింది. బుల్లెట్ ట్రైన్ ఎక్కిన భారత జట్టు టోక్యో నుంచి నగోయాకు పయనమైంది. ప్రస్తుతం టీమ్ఇండియా నగోయాకు చేరుకోగా.. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది.
India Vs Iran Kabaddi 2026: ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరుల్లో ఇరు జట్లు ఇరాన్‌ను మట్టికరిపించి ఆసియా వేదికపై భారత కబడ్డీ ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పాయి. పురుషుల జట్టు 40 - 34 తేడాతో విజయం సాధించి తమ 9వ ఆసియా క్రీడల స్వర్ణాన్ని గెలుచుకోగా, మహిళల జట్టు 37 - 34 తేడాతో గెలిచి 4వ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
India Vs Iran Kabaddi 2026: ఆసియా క్రీడలలో భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో బలమైన ఇరాన్ జట్టుపై విజయం సాధించి, ఆసియా కబడ్డీలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ తన మొత్తం పతకాల సంఖ్యను 27కి పెంచుకుంది.
Mirabai Chanu Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో రజత (సిల్వర్) పతకాన్ని కైవసం చేసుకుంది. నగోయాలో జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ఆమె మొత్తం 198 కేజీల బరువు పైకి ఎత్తి ఈ మెడల్ సాధించారు. 1998లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం గెలిచిన తర్వాత, ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.