SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో భారత్ విజయభేరి..ఒకే రోజు ఆర్చరీలో 3 బంగారు పతకాలు..

Asian Games 2026 Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఏమాత్రం గురి తప్పకుండా ఒకే రోజులో హ్యాట్రిక్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశానికి ఘనమైన విజయాన్ని అందించారు. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాల్లో తెలుగు అమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు కీలక పాత్ర పోషించగా, డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన పురుషుల జట్టు కూడా తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.

Written By Harish Darla
Published: Sep 30, 2026, 02:17 PM IST | Updated: Sep 30, 2026, 02:20 PM IST
Join

Asian Games 2026 Archery: మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లో భారత క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ, పెద్దపల్లికి చెందిన చికితా రావులతో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రీతికా ప్రదీప్‌లతో కూడిన భారత త్రయం ఫైనల్‌లో చైనా జట్టుపై 238 - 234 పాయింట్ల తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2014లో దక్షిణ కొరియా జట్టు నమోదు చేసిన 238 పాయింట్ల అరుదైన రికార్డును భారత మహిళల జట్టు సమం చేసి చరిత్ర సృష్టించింది.

షూట్‌ఆఫ్‌లో ఉత్కంఠ పోరు
అనంతరం జరిగిన మిక్స్డ్ కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఫైనల్ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చికితా రావు, మహారాష్ట్రకు చెందిన సాహిల్ రాజేశ్ జాదవ్‌ల భారత ద్వయం దక్షిణ కొరియా జట్టుతో హోరాహోరీగా తలపడింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించగా, అందులో భారత జట్టు 158 - 157 తేడాతో నెగ్గి రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో చికితా రావు ఒకే రోజు రెండు పసిడి పతకాలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచారు.

ముచ్చటగా మూడో స్వర్ణం
అనంతరం జరిగిన పురుషుల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లోనూ భారత్ విజేతగా నిలిచి దేశానికి మూడో స్వర్ణాన్ని అందించింది. కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరులతో కూడిన భారత త్రయం డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనా జట్టుపై 238 - 237 తేడాతో విజయం సాధించి వరుసగా మూడో పసిడి పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది.

టైటిళ్లను నిలబెట్టుకున్న భారత్
గతంలో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో భారత్ మొత్తం ఐదు బంగారు పతకాలను సాధించింది. ప్రస్తుత పోటీల్లోనూ ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, మూడింటిలో తమ డిఫెండింగ్ ఛాంపియన్ టైటిళ్లను విజయవంతంగా నిలబెట్టుకోవడం విశేషం.

Also Read: Asian Games India Semis: ఆసియా గేమ్స్‌లో టీమ్ఇండియాకు జాక్‌పాట్..ఒక్క బాల్ ఆడకుండానే సెమీఫైనల్‌కు!

Also REad: Team India Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లోని టీమ్ఇండియా ఆటగాళ్ల సందడి..ఆసియా గేమ్స్‌ కోసం హీరోల్లా బయల్దేరారు!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES