SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ajit Agarkar Salary: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ జీతం ఎంతంటే..? మొత్తం ఆస్తుల విలువ తెలుసా..!

Ajit Agarkar Salary: మూడు ఐసీసీ టైటిళ్లను అందించిన బెస్ట్ ట్రాక్ రికార్డుతో పాటు కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన అజిత్ అగార్కర్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా తన మూడేళ్ల బాధ్యతలకు ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో అత్యధిక వేతనం అందుకున్న చీఫ్ సెలెక్టర్‌గా రికార్డు సృష్టించిన ఆయన ఆదాయం, నికర ఆస్తుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Written By Ashok Krindinti
Published: Oct 08, 2026, 04:56 PM IST | Updated: Oct 08, 2026, 04:57 PM IST
Image Credit: Ajit Agarkar Salary (Source: File)
Join

Ajit Agarkar Salary: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలం ఇటీవల ముగిసింది. దాదాపు మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించిన ఆయన.. అక్టోబర్ 4తో తన పదవి నుంచి వైదొలిగారు. అజిత్ అగార్కర్ అందించిన సేవలను, విజయాలను గుర్తుచేసుకుంటూ బీసీసీఐ ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రస్తుతం కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

జూలై 2023లో సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలను (రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ) కైవసం చేసుకుంది. అయితే తన పదవీ కాలంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లను టెస్టుల నుంచి రిటైర్‌ అయ్యేలా ఒత్తిడి చేయడం.. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి పలువురు సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడంపై విమర్శలు వచ్చాయి. అయితే యువ ప్రతిభావంతులకు విస్తృతంగా అవకాశాలు కల్పించారు.

ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ బీసీసీఐ నుంచి ఎంత జీతం అందుకున్నారు..? ఆయన మొత్తం ఆస్తి విలువ ఎంత అనే చర్చ క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అగార్కర్ నియామకానికి ముందు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ వార్షిక వేతనం దాదాపు రూ.కోటిగా ఉండేది. అయితే అగార్కర్ బాధ్యతలు చేపట్టే సమయానికి బీసీసీఐ ఆ వేతనాన్ని వార్షికంగా రూ.3 కోట్లకు పెంచారు. ఈ లెక్కన మూడేళ్ల మూడు నెలల పాటు సేవలందించినందుకు గాను ఆయన బీసీసీఐ నుంచి దాదాపు రూ.9.75 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోంది.

అగార్కర్ మొత్తం నికర ఆస్తుల విలువ విషయానికి వస్తే.. రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అగార్కర్.. కోచింగ్, కామెంట్రీ వంటి రంగాల్లో కెరీర్‌ను కొనసాగించారు. 1977లో ముంబైలో జన్మించి.. 1998లో టీమిండియాలోకి అడుగుపెట్టిన అగార్కర్ వన్డేల్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచారు. భారత్ తరఫున 191 వన్డేలు ఆడిన ఆయన 288 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీలతో 1,269 పరుగులు సాధించారు. అలాగే 26 టెస్టుల్లో 58 వికెట్లు తీసి ఒక సెంచరీ నమోదు చేయగా.. 4 టీ20 మ్యాచ్‌లలో 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం, సెలెక్టర్‌గా అందిన వేతనం, కామెంట్రీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆయన ఇంతటి భారీ సంపదను సమకూర్చుకున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES