SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harmanpreet Kaur Net Worth: మైదానంలోనే కాదు సంపాదనలోనూ సంచలనమే.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్ వర్త్ ఎంతంటే..?

Harmanpreet Kaur Net Worth: భారత మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లిన డాషింగ్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె కెరీర్ సంపాదన, కోట్లాది రూపాయల ఆస్తుల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Written By Ashok Krindinti
Published: Oct 06, 2026, 07:12 PM IST | Updated: Oct 06, 2026, 07:15 PM IST
Image Credit: Harmanpreet Kaur Net Worth (Source: File)
Join

Harmanpreet Kaur Net Worth: భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ ఊహించని విధంగా కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. కేవలం టీ20 ఫార్మాట్‌ నుంచి కెప్టెన్సీ తప్పుకోవాలని బీసీసీఐ సూచించగా.. ఆమె మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పారని ప్రచారం జరుగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. హర్మన్ సాధించిన రికార్డులతో పాటు కెరీర్ సంపాదన, ఆస్తుల వివరాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించే ఈ డాషింగ్ క్రికెటర్.. మైదానం వెలుపల ఆర్థికపరంగానూ అగ్రశ్రేణి భారత క్రీడాకారిణుల్లో ఒకరిగా నిలిచారు.

తాజా గణాంకాల ప్రకారం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.23 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రధానంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, అంతర్జాతీయ మ్యాచ్ ఫీజులు, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) భారీ ఒప్పందాలు, అలాగే ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా మాజీ కెప్టెన్ గట్టిగానే సంపాదించారు. బీసీసీఐ మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులలో అత్యున్నత కేటగిరీ 'గ్రేడ్-ఏ' విభాగంలో కొనసాగుతున్నారు. ఇందుకుగానూ ఏడాదికి రూ.50 లక్షల రిటైనర్ ఫీజును ఆమె అందుకుంటున్నారు. దీనికి తోడు బీసీసీఐ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సమాన వేతన విధానం ప్రకారం.. పురుషుల జట్టుతో సమానంగా ఒక్కో టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు.. ఐసీసీ టోర్నమెంట్ల ద్వారానే ఆమెకు కోట్ల రూపాయల మ్యాచ్ ఆదాయం లభిస్తోంది.

ఇక ఫ్రాంచైజీ లీగ్స్ విషయానికి వస్తే.. డబ్ల్యూపీఎల్‌ మొదటి వేలంలోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆమెను రూ.1.80 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా ముంబై జట్టును విజేతగా నిలిపి తన బ్రాండ్ విలువను మరింత పెంచుకున్న ఆమె.. ఏటా ఈ లీగ్ ద్వారా భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నారు. గతంలో విదేశీ లీగ్స్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ ‘ది హండ్రెడ్’ టోర్నీలలో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచారు. అంతర్జాతీయ లీగ్స్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందారు.

కేవలం క్రీడా పారితోషికాలే కాకుండా నైకీ, బూస్ట్, సియట్ వంటి దిగ్గజ బ్రాండ్లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. కోట్లలో ఎండార్స్‌మెంట్ రుసుములు అందుకుంటున్నారు. ఈ ఆదాయంతో పంజాబ్‌లోని మోగాతో పాటు ముంబై నగరంలో ఖరీదైన లగ్జరీ నివాసాలు, విలాసవంతమైన కార్లు, కస్టమైజ్డ్ హార్లే డేవిడ్సన్ బైక్‌ను ఆమె సమకూర్చుకున్నారు. మైదానంలో తన పరుగుల దాహంతో మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చిన హర్మన్‌ప్రీత్.. నేడు దేశంలో అత్యంత ధనిక, ప్రభావవంతమైన మహిళా అథ్లెట్లలో ఒకరిగా నిలిచి వర్ధమాన క్రీడాకారులకు ఆదర్శంగా మారారు.

Also Read: ప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES