SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

Harmanpreet Kaur Retirement from Captaincy: భారత మహిళా క్రికెట్ టీమ్ లో ఒక కీలక అధ్యాయం ముగిసింది. సుదీర్ఘకాలంగా టీమ్ ఇండియాను సక్సెస్ ఫుల్ గా నడిపించిన స్టార్ ఆల్ రౌండర్.. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్ కౌర్ 3 ఫార్మాట్లు ( టెస్టులు, వన్డేలు, టీ20లు) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 06, 2026, 11:25 AM IST | Updated: Oct 06, 2026, 11:27 AM IST
Image Credit: Harmanpreet Kaur Retirement
Join

 Harmanpreet Kaur Retirement from Captaincy: భారత మహిళా క్రికెట్ టీమ్ లో ఒక కీలక అధ్యాయం ముగిసింది. సుదీర్ఘకాలంగా టీమ్ ఇండియాను సక్సెస్ ఫుల్ గా నడిపించిన స్టార్ ఆల్ రౌండర్.. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్ కౌర్ 3 ఫార్మాట్లు ( టెస్టులు, వన్డేలు, టీ20లు) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కెప్టెన్ గా తన విధులు పూర్తి అయ్యాయని.. ఇక నుంచి కేవలం క్రీడాకారిణిగా మాత్రమే జట్టుకు తన సేవలను అందిస్తానని హర్మన్ ప్రత్ కౌర్ స్పష్టం చేశారు.

కాగా హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. 2025లో జరిగిన వన్డే వరల్డ్ కప్ విజయంలో జట్టును ముందుండి నడిపించడంతోపాటు.. ఆసియా క్రీడల్లో టీమిండియా స్వర్ణ పతకం సాధించడంలో ఆమె నాయకత్వం అత్యంత కీలకంగా నిలిచిందని చెప్పాలి. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నెక్ట్స్ కెప్టెన్ సెలక్షన్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES