SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs New Zealand T20 Updates: ఆఖరి పోరుకు టీమిండియాలో భారీ మార్పులు.. విధ్వంసకర హిట్టర్‌కు ఛాన్స్..!

IND vs NZ Playing 11: న్యూజిలాండ్‌తో జరిగే ఐదో టీ20లో భారత్ తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకోవడంతో మిగిలిన ప్లేయర్లను ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Written By Ashok Krindinti
Published: Oct 31, 2026, 08:19 PM IST | Updated: Oct 31, 2026, 08:22 PM IST
Image Credit: IND vs NZ Playing 11 (Source: BCCI)
Join

IND vs NZ Playing 11: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ముగింపునకు వచ్చింది. భారత్ ఇప్పటికే 3-1తో సొంతం చేసుకోగా.. ఆఖరి మ్యాచ్‌లో గెలుపొంది విజయంతో సిరీస్‌ను ముగించాలని చూస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్.. నాలుగో మ్యాచ్‌లో ఏకంగా 87 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఆదివారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమవుతోంది. వైభవ్ సూర్యవంశీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు చోటు కల్పించే ఛాన్స్ ఉంది.

వరుణ్, కుల్దీప్ వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లు జట్టులో ఉన్నా.. నాలుగు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యారు. సిరీస్ ఇప్పటికే చేజిక్కించుకోవడంతో ఈ ఇద్దరిలో ఒకరికి ఆడే అవకాశం ఇవ్వడాన్ని పరిశీలించవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో దూబేకు ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు నితీష్‌ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడారు. ఒకే ఓవర్‌లో 32 పరుగులు పిండుకున్నారు. అంతేకాకుండా 260 పరుగుల ఛేదనలో అతను బ్యాట్‌తో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 10 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 45 పరుగులతో రాణించినా.. ఇషాన్ కిషన్ వచ్చేయడంతో మళ్లీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చి.. ఐదో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.  

నాలుగేళ్ల తరువాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్.. అంచనాలను అందుకోలేకపోయాడు. వికెట్లు తీయడం సంగతి పక్కనపెడితే.. యువ బౌలర్లతో పోటీగా ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో నాలుగో మ్యాచ్‌కు పక్కనపెట్టారు. మరీ ఐదో మ్యాచ్‌లో భూవీ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

భారత్ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/భువనేశ్వర్, మయాంక్ యాదవ్.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES