• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం

Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం

Indian Hockey Women Bags Gold Medal After 44 Years In Asian Games: ఆసియా క్రీడల్లో భారత హకీ క్రీడాకారిణులు చరిత్ర సృష్టించారు. 44 ఏళ్ల తర్వాత ఖండాంతర క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు నెలకొల్పారు. చైనాపై అద్భుత విజయం సాధించిన భారత హకీ మహిళా జట్టు 2028 ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 02, 2026, 06:21 PM IST|Updated: Oct 02, 2026, 07:10 PM IST
joinshare
Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం
Image Credit: Source: Indian Hockey Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Abhishek Sharma: కావ్య మారన్‌కు బిగ్‌ షాక్.. సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ గుడ్‌ బై..?

Abhishek Sharma: కావ్య మారన్‌కు బిగ్‌ షాక్.. సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ గుడ్‌ బై..?

2

Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం

3

తెలంగాణ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు భారీ విరాళం.. నాగర్ కర్నూల్, వికారాబాద్‌లో కమ్యూనిటీ కిచెన్లు

4

స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?

5

సుప్రీంకోర్టులో రూ.35 వేల జీతంతో 250 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే జాబ్.. పూర్తి వివరాలివే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Indian Hockey Women Bags Gold Medal After 44 Years: ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల మోత మోగిస్తోంది. క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తుండగా.. భరతమాత మెడలో గోల్డ్‌ మెడల్స్‌తోపాటు ఇతర మెడల్స్‌ పడుతున్నాడు. ఈ క్రమంలోనే హకీలో మహిళా క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో హకీ ఫైనల్స్‌లో చైనాను మట్టికరిపించిన మన అమ్మాయిలు స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టారు. ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల తర్వాత హకీలో గోల్డ్‌ మెడల్‌ను భారత మహిళలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ విజయంతో భారత జట్టు 2028 ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించడం విశేషం.

డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాకు షాక్
ఆసియా క్రీడల్లో శుక్ర‌వారం జ‌రిగిన హకీ ఫైన‌ల్లో చైనాతో భార‌త్ తలపడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాకు గట్టి పోటీనిచ్చిన భారత అమ్మాయిలు తుది వరకు అదే ప్రదర్శన కొనసాగించి డ్రాగన్‌ జట్టును చిత్తు చేశారు. మ్యాచ్‌ ప్రథమార్థంలో 10వ నిమిషంలో భార‌త ప్లేయ‌ర్ లాల్‌రెమ్‌సియామి సాధించిన ఒక్క గోల్‌ తప్ప మ్యాచ్‌ ముగిసేవరకు ఇరు జట్లు సాధించలేకపోయాయి.  లెఫ్ట్ సైడ్ సర్కిల్ నుంచి బంతిని నెట్‌లోకి పంపించి లాల్‌రెమ్‌సియామి భార‌త జట్టును ఆధిక్యంలోకి తీసుకురావడమే కాకుండా స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనా ప్లేయ‌ర్ల అటాకింగ్ గేమ్‌ను స‌మ‌ర్థంగా అడ్డుకుంది. చైనా ఆటగాళ్లు సంధించిన పెనాల్టీ స్ట్రోక్‌లను కూడా భారత ఆటగాళ్లు నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం భారత్‌కు 44 ఏళ్లుగా అందని ద్రాక్షగా మారింది. 1982లో ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క్రీడల్లో భారత మ‌హిళ‌ల జట్టు స్వర్ణ పతకం గెలిచింది. అప్పుడు జరిగిన తుది పోరులో భార‌త్ 22-0తో హాంకాంగ్‌పై సంచలన విజ‌యం సాధించి.. స్వ‌ర్ణ పతకం కొల్లగొట్టింది. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా నుంచి భారత జట్టు బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో 2028 ఒలింపిక్స్‌కు భారత జట్టు వెళ్లనుంది. ఆసియా క్రీడల్లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు అద‌ర‌గొట్టి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతో అందరూ మహిళా క్రీడాకారులను అభినందిస్తున్నారు. 44 ఏళ్ల నిరీక్ష‌ణ తర్వాత గోల్డ్‌ మెడల్‌ సాధించిన మన అమ్మాయిలకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఒక్కరోజే ఆరు స్వర్ణాలు..
ఇక ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు నెలకొల్పుతూ తిరుగులేని విజయాలు పొందుతున్నారు. పతకాల వేటలో భారత్‌ స్థాయికి మించి ప్రదర్శన కొనసాగుతోంది. ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. మహిళా హకీ సాధించిన స్వర్ణం 16వ మెడల్‌ కావడం విశేషం. అయితే ఇతర క్రీడల్లో కూడా భారత్‌కు భారీగా స్వర్ణ పతకాలు లభిచాయి. శుక్రవారం జరిగిన పలు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఆరు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో ఒకటి, మహిళల హాకీ జట్టుతో కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు కాగా.. ఆసియా క్రీడల్లో భారత్‌ సాధించిన పతకాలు 76కు చేరగా.. పతకాల పట్టికలో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతుంది.

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాలు
16 స్వర్ణాలు
25 రజతాలు
35 కాంస్యాలు

Add Zee News as a Preferred Source