Virat Kohli: స్వామిజీ ఆశ్రమంతో రూ.5 కోట్ల పంచాయితీ.. విరాట్ కోహ్లీ టీమ్ ఏం చెప్పిందంటే?
Virat Kohli Rs 5 Crores Took For Ashram Visit Here Is Fact Check: ఆశ్రమాన్ని సందర్శించడంతో స్వామిజీ నుంచి రూ.5 కోట్లు పొందారని తీవ్ర ఆరోపణలు రావడంతో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమ్ స్పందించింది. ఆశ్రమాన్ని సందర్శన కోసం కోహ్లీ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఖండించింది. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kohli Ashram Visit: ఓ స్వామిజీ ఆశ్రమాన్ని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి సందర్శించగా.. ఇప్పుడు అది వివాదంగా మారింది. కోహ్లీ స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించడం కోసం కోహ్లీ దంపతులు భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆశ్రమం గుర్తింపు కోసం ఓ స్వామిజీ కోహ్లీకి రూ.5 కోట్లు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఎట్టకేలకు కోహ్లీ బృందం స్పందించింది. కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలను ఖండించింది. ఈ సందర్భంగా కోహ్లీ టీమ్ కీలక ప్రకటన చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని రాధా కేలీ కుంజ్ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని ఇటీవల విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సందర్శించారు. అక్కడ స్వామిజీని కలిసి ఆశీర్వాదం పొందారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే కోహ్లీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడంపై శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహరి మహారాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్రమానికి ప్రజాదరణను పెంచే ప్రయత్నాలలో భాగంగా కోహ్లీని డబ్బులు పెట్టి మరి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి తీసుకువచ్చాడని ఆరోపించారు. దీనికోసం విరాట్ కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారని ఫలహరి మహారాజ్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
డబ్బులు తీసుకుని విరాట్ కోహ్లీ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించడంతో పెద్ద ఎత్తున వివాదం రేగింది. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపగా ఈ విషయం కోహ్లీ దృష్టికి వెళ్లింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ కోహ్లి టీమ్ ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డబ్బులు తీసుకుని ఆశ్రమాన్ని సందర్శించారని చేసిన వాదన పూర్తిగా అబద్ధం, నిరాధారం' అని కోహ్లీ టీమ్ స్పష్టం చేసింది. 'రూ.5 కోట్లు తీసుకుని ఆశ్రమాన్ని సందర్శించారని ఆరోపణలు చేయడం ఇది పరువుకు నష్టం కలిగించేది' అని కోహ్లీ టీమ్ తెలిపింది.
'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కేవలం తమ సొంత విశ్వాసం, భక్తితోనే ప్రేమానంద్ మహారాజ్ దర్శనం కోసం బృందావన్‌కు వెళ్తుంటారు. ఈ పర్యటనలో ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదు. ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కోహ్లీ టీమ్ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి నిరాధార వార్తలు లేదా ప్రచారం వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను చూసుకోవాలని కోహ్లీ ప్రతినిధి బృందం సూచించింది.
కోహ్లి, అనుష్క శర్మ దంపతులు బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని నిత్యం సదర్శిస్తుంటారని కోహ్లీ టీమ్ వివరించింది. తొలిసారిగా 2023 జనవరిలో కుమార్తె వామికతో కలిసి కోహ్లీ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించి మహారాజ్ ఆశీస్సులు పొందారని గుర్తుచేసింది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో.. ఇతర సమయాల్లోనూ కోహ్లీ దంపతులు బృందావనంలో ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారని వెల్లడించింది. భక్తి, జీవిత మార్గంపై మహారాజ్ ఆశ్రమం కోహ్లీ దంపతులకు దిశానిర్దేశం చేస్తుందని.. తాము చేసే పనులను భగవంతుడి సేవగా భావించాలని, నిరంతరం వినయాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తుందని విరాట్ కోహ్లీ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ ప్రకటనతో డబ్బులు తీసుకుని కోహ్లీ ఆశ్రమాన్ని సందర్శిస్తారనే వివాదానికి ముగింపు పడినట్టు అయ్యింది.