Mohammad Shami: పార్టీ అధినేతతో భేటీ.. రాజకీయాల్లోకి స్టార్ క్రికెటర్
Mohammad Shami Likely To Enter In Politics: రాజకీయాల్లోకి మరో క్రికెటర్ ప్రవేశించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఓ పార్టీ అధినేతతో ఆ క్రికెటర్ సమావేశం కావడంతో అది నిజమని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Mohammad Shami Political Entry: మారిన రాజకీయ పరిస్థితులకు తోడు ఆట నుంచి దూరమవుతున్న నేపథ్యంలో క్రీడాకారులు రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా రాజకీయాల్లోకి మరో క్రికెటర్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని.. రానున్న ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇంతకీ ఎవరో తెలుసా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ. తాజాగా ఓ పార్టీ అధినేతతో అతడు భేటీ కావడంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టులో స్టార్ పేసర్‌గా మహమ్మద్ షమీ చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం వయసు మీద పడడం.. సుదీర్ఘకాలంగా క్రికెట్‌లో కొనసాగుతుండగా.. కొత్త వాళ్లు వస్తుండడంతో షమీకి స్థానం లభించడం లేదు. ఎంత ప్రతిభ ఉన్నా కూడా యువతకు అవకాశం కల్పించాలనే భాగంలో షమీకు అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో మరో రంగం వైపు షమీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధినేతతో షమీ భేటీ కావడం ఈ చర్చకు బలం చేకూరుతోంది.
క్రికెట్‌లో షమీ దేశీ టోర్నీల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు చేశాడు. ఎన్నో రికార్డులు కొల్లగొట్టి.. భారత్ సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ ఇప్పుడు ఆటకు దూరంగా ఉన్నారు. బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన మహమ్మద్ షమీ త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షమీ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధినేత జయంత్ చౌదరితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వీరిద్దరూ రహాస్యంగా భేటీ అయ్యారని తెలుస్తుండగా.. ఎందుకు సమావేశమయ్యారనే అసలు కారణాలు తెలియడం లేదు. దానిపై స్పష్టత రావలసి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లక్ష్యంగా షమీ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్‌ఎల్‌డీ అధినేతతో సమావేశం కావడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.
రానున్న ఎన్నికల్లో షమీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యూపీలోని అమేరోహా నియోజకవర్గం నుంచి షమీ పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. దీంతో యూపీలో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షమీ ఆర్‌ఎల్‌డీ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం లభించనుంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం షమీ రాజకీయాల్లో చేరితే మరి క్రికెట్‌లో మాదిరి రాజకీయాల్లో విజయవంతం అవుతాడా లేదనేది కాలం సమాధానం చెబుతుంది.