PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు
PV Sindhu Clinches Hylo Open 2026 Title: భారత షట్లర్ పీవీ సింధు మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ సీజన్‌లో మరోసారి టైటిల్‌ను నెగ్గి భారత తొలి మహిళగా నిలిచారు. హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు విజేతగా నిలిచి చాంపియన్‌గా నిలిచారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన పీవీ సింధు విజయ ప్రస్థానం తెలుసుకుందాం.
PV Sindhu: ఒలింపిక్ మెడలిస్ట్.. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న పీవీ సింధు ఈ సీజన్‌లో మరో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. హైలో ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్లో చాంపియన్‌గా నిలిచి పీవీ సింధు భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించారు. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో పీవీ సింధు విజయం సాధించి తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పారు.
జర్మనీలోని సార్‌బ్రుకెన్ వేదికగా ‘హైలో ఓపెన్ 2026’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు దూకుడుగా ఆడారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ కేర్స్‌ఫెల్ట్‌తో తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ టైటిల్ పోరులో 21-12, 21-14 తేడాతో విజయం సాధించిన పీవీ సింధు టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనతో హైలో ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన భారత తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సృష్టించారు.
ఫైనల్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి పీవీ సింధు వీరోచితంగా ఆడి డెన్మార్క్ క్రీడాకారిణిపై ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి కేర్స్‌ఫెల్ట్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు రాకెట్‌తో షాట్లు ఆడుతూ అదరగొట్టారు. మొదటి ఆటలో 11-8 ఆధిక్యంతో సింధు బ్రేక్‌కు వెళ్లారు. అనంతరం రెండో గేమ్‌లో అదే ఆధిపత్యాన్ని కొనసాగించిన పీవీ సింధు 21-12 భారీ తేడాతో డెన్మార్క్ షట్లర్ కేర్స్‌ఫెల్ట్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచారు. టైటిల్ పోరులో పీవీ సింధ్ పవర్ ఫుల్ స్మాష్‌లు, పక్కా డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసి 39 నిమిషాల్లోనే చిత్తు చేసింది. ఈ టైటిల్ సాధించడంతో సింధుకు దాదాపు రూ.30 లక్షల దాకా (35,000 అమెరికన్ డాలర్లు) నగదు బహుమతి లభించనుంది.
ఇప్పటివరకు హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో భారత మహిళా క్రీడాకారిణులు ఎవరూ కూడా టైటిల్ సాధించలేదు. పురుషుల విభాగంలో చాలా టైటిల్స్ వచ్చాయి. పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు టైటిళ్లు వచ్చాయి. కానీ మహిళల సింగిల్స్‌లో మాత్రం పీవీ సింధు తొలిసారి చాంపియన్‌గా నిలిచారు. కాగా ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్‌లో కూడా పీవీ సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ వరకు వెళ్లిన పీవీ సింధు టైటిల్‌ను సాధించలేకపోయారు. ప్రపంచ చాంపియన్ ఆన్సే యంగ్ చేతిలో ఓడి టైటిల్‌ను చేజార్చుకున్న పీవీ సింధు ఆ తర్వాత జరిగిన హైలో ఓపెన్‌లో టైటిల్ సాధించడం విశేషం.