• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు

Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు

Police Fire On Raptadu Incident Accused Hemanth: అమానుషంగా.. పాఠశాలలో ఉన్న విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన రాక్షసుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో దాడికి యత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 01, 2026, 09:32 PM IST|Updated: Nov 01, 2026, 09:43 PM IST
joinshare
Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు
Image Credit: Raptadu Police Fire On Accused

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు

Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు

2

Rythu Garjana: రేవంత్‌ రెడ్డి పాలనలో నీళ్లు, కరెంట్, పథకాలు బంద్: కేటీఆర్‌

3

PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు

4

Sajjala: ఎన్నికల్లో దౌర్జన్యకాండ.. మున్సిపల్‌ ఎన్నికలు రద్దు చేయాలని సజ్జల సంచలన డిమాండ్‌

5

Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Police Fire On Raptadu Accused: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన రాప్తాడు విద్యార్థి హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడిన రాక్షసుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై నిందితుడు దాడికి పాల్పడ్డాడని.. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై శనివారం హేమంత్‌ రంపంతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. నిందితుడి రాక్షసంగా ప్రవర్తించి విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు.

హత్యాయత్నానికి పాల్పడిన అనంతరం నిందితుడు బైక్‌పై పరారవడంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఆదివారం రాత్రి ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు తెలిసిందే. అడవిలో దాచుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడ పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. అయితే పోలీసులను చూసి నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు హేమంత్ పట్టుకునే క్రమంలో తమపై దాడికి పాల్పడడంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా అతడిపై కాల్పులు జరిపారని సమాచారం. హేమంత్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. నిందితుడి దాడిలో పలువురు పోలీసులకు గాయాలవగా.. పోలీసుల కాల్పుల్లో హేమంత్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నిందితుడు హేమంత్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నిందుతుడు హేమంత్ చేతిలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

బాలికను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌
నిందితుడి చేతిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకుంటారని.. చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
AP News
Andhra Pradesh