Rinku Singh Priya Saroj Marriage News: టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివారం డిసెంబరు 4, 2026న జరగనుందని అధికారికంగా ప్రకటించారు. తరచూ రింకూ సింగ్ ఆడే మ్యాచ్‌ల్లో వీక్షించేందుకు ఎంపీ ప్రియా సరోజ్ వచ్చేవారు. అయితే రింకూ, ప్రియాల వివాహం గతేడాది జరగాల్సింది. అప్పటికే వారిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వీరిద్దరి వివాహం ఏడాది పాటు వాయిదా పడింది.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్‌ల వివాహ తేదీ ఖరారైంది. ఈ జంట డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. వివాహ తేదీ ఖరారు కాగానే, ఇరు కుటుంబాల వారు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.
రింకూ సింగ్, ప్రియా సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు, వారి సన్నిహిత బంధువులు, ప్రత్యేక అతిథులు ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. రింకూ సింగ్ టీమ్ఇండియా క్రికెటర్ కావడం వల్ల పలువురు క్రికెట్ సెలబ్రిటీలు కూడా పెళ్లికి హజరయ్యే అవకాశం కనిపిస్తోంది. క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థ వేడుక 2025 జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ హోటల్‌లో జరిగింది.
రింకూ, ప్రియాల ప్రేమకథ ఎలా మొదలైంది?
2025లో వారి నిశ్చితార్థం తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ప్రియతో తన ప్రేమకథ ఎలా మొదలైందో క్రికెటర్ రింకూ సింగ్ వెల్లడించాడు. తాను ఒక ఫ్యాన్ పేజీలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఫోటోను చూశానని, మొదట్లో ఆమెకు మెసేజ్ చేయడానికి సంకోచించానని ఈ భారత క్రికెటర్ తెలిపాడు. కానీ, ప్రియ తన కొన్ని ఫోటోలను లైక్ చేయడం చూశాక, ఆమెకు మెసేజ్ చేయడానికి ధైర్యం తెచ్చుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది.
"మా ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ముంబైలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మొదలైంది" అని క్రికెటర్ రింకూ సింగ్ చెప్పాడు. "తన నియోజకవర్గంలోని ఓటింగ్‌కు సంబంధించిన ఒక ఫ్యాన్ పేజీలో నేను ఆమె ఫోటో చూశాను. ఆమె నాకు సరైన జోడీ అనిపించింది, కానీ మొదట అతనికి మెసేజ్ చేయడానికి సంకోచించాను. అతను నా కొన్ని ఫోటోలను లైక్ చేసినప్పుడు, నేను చివరికి అతనికి మెసేజ్ చేశాను. అక్కడే ఇదంతా మొదలైంది. కొన్ని రోజుల తర్వాత మ్యాచ్‌లకు ముందు క్రమం తప్పకుండా కాల్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. 2022లో గానీ తనకు అతనిపై ప్రేమ అనే భావన కలగలేదు" అని ఓ ఇంటర్వ్యూలో రింకూ సింగ్ వెల్లడించాడు.
టీమ్ఇండియా తరఫున రింకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఎంపీ ప్రియా అతనికి మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా, మ్యాచ్‌ల సమయంలో కేకేఆర్ స్టార్‌ను ప్రోత్సహించడానికి ఈడెన్ గార్డెన్స్‌కు కూడా హాజరైంది. అయితే తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రింకూ సింగ్‌కు జట్టులో అవకాశం కల్పించకపోవడం గమనార్హం.
Also REad: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!
Also REad: భారత వెయిట్‌లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook