SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shami Wife Politics: రాజకీయాల్లోకి క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య.."షమీని తుక్కుతుక్కుగా ఓడిస్తా"!

Mohammed Shami Wife Politics: టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కుటుంబ వివాదం ఇప్పుడు రాజకీయ రంగులు పులుముకుంటోంది. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షమీ లేదా ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. తాను ప్రత్యర్థిగా పోటీ చేస్తానంటూ షమీ భార్య హాసీన్ జహాన్ సంచలన ప్రకటన చేసింది.

Written By Harish Darla
Published: Sep 28, 2026, 04:41 PM IST | Updated: Sep 28, 2026, 04:43 PM IST
Join

Mohammed Shami Wife Politics: 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమ్రోహా సదర్ నియోజకవర్గం నుండి టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ లేదా ఆయన సోదరుడు మహమ్మద్ హబీబ్ ఎన్నికల బరిలోకి దిగవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మహమ్మద్ షమీ లేదా అతని సోదరుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తాను ప్రత్యర్థిగా బరిలో దిగుతానని హసీన్ జహాన్ స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు తాను వెనకడుగు వేయబోనని.. ఎన్నికల మైదానంలో షమీని 'క్లీన్ బౌల్డ్' చేస్తానని ఆమె సంచలన ప్రకటన చేశారు.

గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్‌లీడర్‌గా, గ్లామరస్ మోడల్‌గా పనిచేసిన హసీన్ జహాన్.. 2014 జూన్ 6న టీమ్ఇండియా బౌలర్ మహమ్మద్ షమీని వివాహం చేసుకున్నారు. అయితే 2018లో షమీపై గృహహింస, వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. దీనిపై విచారణ జరిపిన బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుండి బౌలర్ మహమ్మద్ షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి వీరిద్దరి మధ్య విడాకులు, భరణానికి సంబంధించిన కేసుల్లో కోర్టుల్లో సుదీర్ఘ వాదనలు నడుస్తున్నాయి.

న్యాయపోరాటంలో భాగంగా జనవరి 2023లో జిల్లా కోర్టు హసీన్ జహాన్‌కు నెలకు రూ. 50,000, కుమార్తెకు రూ. 80,000 భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఆ తర్వాత జూలై 2025లో కలకత్తా హైకోర్టు ఈ మొత్తాన్ని సవరించి హసీన్ జహాన్‌కు రూ. 1.50 లక్షలు, కుమార్తెకు రూ. 2.50 లక్షలు చొప్పున నెలకు మొత్తం రూ. 4 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది.

అదే విధంగా 2026 ఫిబ్రవరిలో తన కేసులను కోల్‌కతా నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ హసీన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చివరిగా మే 2026లో లక్ష రూపాయల చెక్ బౌన్స్ కేసులో అలీపూర్ కోర్టు షమీని నిర్దోషిగా విడుదల చేసింది.

మీడియా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే షమీ కుటుంబం ఈ 'రాజకీయ ప్రవేశ ప్రచారం' చేస్తోందని షమీ భార్య హసీన్ జహాన్ ఆరోపించారు. అమ్రోహా ప్రజల ముందుకు వెళ్లి షమీ కుటుంబం అహంకారాన్ని, సంపద గర్వాన్ని దెబ్బతీసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తన హక్కుల పోరాటాన్ని ఉధృతం చేయడానికే కోల్‌కతా నుండి ఢిల్లీకి మారినట్లు ఆమె స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES