SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shoaib Malik Vaneeza Sattar: నాలుగో పెళ్లికి రెడీ అయిన సానిమా మీర్జా మాజీ భర్త..44 ఏళ్ల వయసులో 31 ఏళ్ల హీరోయిన్‌తో షోయబ్ మాలిక్ లగ్గం!

Shoaib Malik Vaneeza Sattar Marriage: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదే విషయమై ఇప్పుడు సోషబ్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. 44 ఏళ్ల వయసులో షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి చేసుకోనున్నాడని.. అక్టోబరు 2న పాకిస్థాన్‌కు చెందిన మోడల్, నటి వనీజా సత్తార్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Oct 03, 2026, 04:17 PM IST | Updated: Oct 03, 2026, 04:20 PM IST
Join

Shoaib Malik Vaneeza Sattar Marriage: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడని సమాచారం అందుతోంది. కరాచీకి చెందిన 31 ఏళ్ల మోడల్, నటి వనీజా సత్తార్‌ను పెళ్లాడనున్నాడట. వనీజా సత్తార్ అనే ఆమె పాకిస్తానీ మోడల్ కాగా.. టెలివిజన్‌ నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందారు. 

కరాచీలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె కరాచీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చదువు పూర్తయ్యాక.. తన 18వ ఏటనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిందట. అహ్మద్ జెహాన్జెబ్ రూపొందించిన 'తేరా మేరా హై ప్యార్ అమర్' అనే మ్యూజిక్ వీడియోతో కెరీర్‌లో మొదటి బ్రేక్ లభించిందట.

అంతటి గుర్తింపు తర్వాత వనీజా సత్తార్.. నటనవైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. బుల్లితెర సీరియల్ డ్రామా 'లాడ్లీ' ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా..అందులో ఆమె పోషించిన 'నాజో' పాత్రతో విశేషమైన ప్రజాదరణ లభించింది. 'లాడ్లీ'తో పాటు ఆమె 'మర్హమ్', 'కుచ్ అన్‌కహీ', 'ఎహ్ద్-ఎ-వఫా', 'టూటా హువా దిల్' వంటి ప్రముఖ షోలలో కూడా నటించారు. 

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే వనీజాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ ఆమె క్రమం తప్పకుండా తన వ్యక్తిగత విశేషాలను, షో అప్‌డేట్‌లను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

షోయబ్ మాలిక్ వివాహాల చరిత్ర..
మరోవైపు 44 ఏళ్ల వయసున్న షోయబ్ మాలిక్ గత వివాహ బంధాలను పరిశీలిస్తే.. మొదటిసారిగా 2002లో అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. సుమారు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ బంధానికి 2010లో బ్రేకులు పడ్డాయి. ఆ వెంటనే వీరిద్దరూ విడాకులు తీసుకోగా.. షోయల్ మాలిక్ దీని తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడాడు. 

2018లో వీరిద్దరికి 'ఇజాన్ మీర్జా' అనే కుమారుడు జన్మించాడు. అయితే వీరిద్దరికి కొడుకు పుట్టిన తర్వాత వీరి మధ్య దూరం మరింత పెరిగింది. 2024లో తామిద్దరూ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న మరుక్షణం పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లాడాడు షోయబ్ మాలిక్. 2024 జనవరి 19న వీరిద్దరి వివాహం జరిగింది. అయితే సనాతో పెళ్లయిన రెండేళ్ల తర్వాత, ఆయన నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడని పుకార్లు వచ్చాయి. అక్టోబరు 2న పాకిస్తానీ మోడల్, నటి వనిజా సత్తార్‌ను పెళ్లి చేసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ వార్తలపై షోయబ్ మాలిక్ లేదా వనీజా సత్తార్ స్పందించలేదు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES