SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Virat Kohli 100 Centuries: "కోహ్లీ 100 సెంచరీలు కొట్టలేడు, 98కే పరిమితం" సచిన్ రికార్డుపై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు!

Virat Kohli 100 Centuries Akash Chopra: అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల వరల్డ్ రికార్డును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమిస్తాడా అనే అంశంపై ఇప్పుడు అందరిలోనే ఆసక్తిగా చర్చ జరుగుతోంది. కోహ్లీ ప్రస్తుతం 86 సెంచరీలతో ఇంటర్నేషనల్ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. అయితే కోహ్లీ తన కెరీర్‌ను 98 సెంచరీలతో ముగిస్తాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేస్తున్నారు. సచిన్ రికార్డుకు 2 సెంచరీల దూరంలో తన కెరీర్‌కు ముగింపు చెబుతాడని అభిప్రాయపడ్డారు.

Written By Harish Darla
Published: Oct 03, 2026, 12:49 PM IST | Updated: Oct 03, 2026, 12:52 PM IST
Join

Virat Kohli 100 Centuries Akash Chopra: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100 సెంచరీల మైలురాయిని అందుకోలేడని 'క్రిక్‌ఇన్ఫో' వేదికగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో 38 ఏళ్ల పడిలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టనున్నాడు. అలాగే 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ తన చివరి టోర్నీ అని ఇదివరకే చెప్పాడని అందరికీ తెలిసిన విషయమే.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న కోహ్లీ, తన అంతర్జాతీయ కెరీర్‌ ముగిసేసరికి 98 సెంచరీలు మాత్రమే చేయగలడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు.

వెస్టిండీస్‌పై సెంచరీతో కథ మారింది!
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో తన 55వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఇదే సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ తన 86వ సెంచరీగా నిలిచింది. 

ఈ సెంచరీ తర్వాత ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 796 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. అదే మ్యాచ్‌లో శతకంతో రాణించిన భారత ఓపెనర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 816 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు.

వన్డేల్లో 15,000 పరుగులు.. మరిన్ని రికార్డులు..
వెస్టిండీస్‌పై సాధించిన శతకంతో కోహ్లీ వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. 2025 అక్టోబర్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (14,243 పరుగులు)ను అధిగమించినప్పటి నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు. 

ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 375 మ్యాచ్‌ల్లో 13,704 పరుగులతో నాలుగో స్థానంలో, శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 448 మ్యాచ్‌ల్లో 13,430 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి కోహ్లీ ఎన్ని శతకాలు బాదుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES