SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Virat Kohli 15000 Record: సచిన్ రికార్డును అవలీలగా బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..అన్నీ ఖతం, ఆ ఒక్కటి తప్పా!

Virat Kohli 15000 New Record: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్తలో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్ జట్టులో నిన్న తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో చేసిన పరుగులతో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును విరాట్ కోహ్లీ అతితక్కువ మ్యాచ్‌ల్లోనే ఛేదించాడు.

Written By Harish Darla
Published: Sep 28, 2026, 02:06 PM IST | Updated: Sep 28, 2026, 02:09 PM IST
Join

Virat Kohli 15000 New Record: కేరళంలోని తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా.. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. అతను 377 ఇన్నింగ్స్‌ల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 

అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ (15,000* పరుగులు) రెండో స్థానానికి చేరుకున్నాడు. వీరిద్దరి తర్వాత శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) తదుపరి స్థానాల్లో నిలిచారు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ..
వన్డేల్లో 8,000 నుంచి 14,000 పరుగుల వరకు ప్రతి మైలురాయిని అత్యంత వేగంగా పూర్తి చేసిన రికార్డులన్నీ విరాట్ కోహ్లీ పేరిటే ఉన్నాయి. ముఖ్యంగా 9,000 నుంచి 10,000 పరుగులకు చేరుకోవడానికి కోహ్లీకి కేవలం 11 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టడం విశేషం. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును అధిగమించి 50వ శతకం నమోదు చేసిన కోహ్లీ, ప్రస్తుతం 54 సెంచరీలతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆ ఒక్క రికార్డు ఆగిపోయింది!
అయితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ చరిత్ర లిఖించగా.. ఇప్పుడా ఆ ఒక్క రికార్డును అందుకునేందుకు విరాట్ కోహ్లీ శ్రమిస్తున్నాడు. అయితే ఈ రికార్డుపై తనకు ఆసక్తి లేదని, కేవలం అది సచిన్‌కు మాత్రమే సాధ్యమని విరాట్ కోహ్లీ పలుమార్లు చెప్పుకొచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 86 సెంచరీలు సాధించగా.. సచిన్ రికార్డును అందుకునేందుకు మరో 14 సెంచరీలు చేయాల్సి ఉంటుంది.

వన్డే ఫార్మాట్‌లో మరే ఇతర బ్యాటర్ కనీసం 35 సెంచరీలు కూడా చేయలేకపోవడం కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనం. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వచ్చే ఏడాది ప్రపంచకప్‌ను తన చివరి మెగా టోర్నమెంట్‌గా ఆడనున్నాడు.

ప్రస్తుత మ్యాచ్ విశేషాలు
విండీస్‌, టీమ్ఇండియా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జస్టిన్ గ్రీవ్స్ (101) అద్భుత శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో రాణించాడు.

ఆ తర్వాత 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (32) వికెట్ కోల్పోయినప్పటికీ, విరాట్ కోహ్లీ (139 పరుగులు) నాటౌట్‌గా నిలవగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110), రుతురాజ్ గైక్వాడ్ (13)తో కలిసి అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విరాట్ కోహ్లీ విజయాన్ని అందించాడు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES