SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

West Indies Won: భారత్‌కు షాక్‌.. హోప్‌ 'శత'క్కొట్టడంతో వెస్టిండీస్‌ అనూహ్య విజయం

West Indies Won By 6 Wickets Against India In T20 2nd Match: టీ20 సిరీస్‌లో భారత్‌కు వెస్టిండీస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. శాయ్‌ హోప్‌ అజేయ సెంచరీతో భారత్‌పై విండీస్‌ అనూహ్య విజయం సాధించి పొట్టి సిరీస్‌ను సమం చేసింది. రాంచీలో జరిగిన ఈ ఆసక్తికర మ్యాచ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 09, 2026, 11:32 PM IST | Updated: Oct 09, 2026, 11:42 PM IST
Image Credit: Source: BCCI And West Indies Cricket
Join

West Indies Won By 6 Wickets: వన్డే సిరీస్‌ను కోల్పోవడమే కాకుండా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌ అద్భుతంగా పుంజుకుని భారత్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. రాంచీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించి తొలి మ్యాచ్‌ ఓటమి కసిని భారత్‌పై తీర్చుకుంది. శాయ్‌ హోప్‌ అద్భుతమైన అజేయ సెంచరీతో టీ20 సిరీస్‌ను సమం చేసింది. 9 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విండీస్‌ విజయం సాధించింది. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు సాధించింది. సంజూ శామ్‌సన్‌ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 82 పరుగులు సాధించగా.. తిలక్‌ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఇషాన్‌ కిషన్‌ 43 స్కోర్‌ చేసి పర్వాలేదనిపించగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 40 పరుగులతో మెరిశాడు. ఇక స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 20 పరుగలకు పరిమితమవగా.. శివమ్‌ దూబే ఏడు పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో విండీస్‌ బౌలర్‌ రోస్టన్‌ చేజ్‌ 3 వికెట్లు తీసి ఔరా అనిపించగా.. షామర్‌ స్ప్రింగర్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

భారత్‌ విధించిన లక్ష్యాన్ని 18.3 ఓవర్‌లకు నాలుగు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్‌ ఛేదించింది. శాయ్‌ హోప్‌ అద్భుత సెంచరీతో చెలరేగి ఆడాడు. కమిలీ పూరన్‌ (4), షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ (0), రావ్‌మెన్‌ పావెల్‌ (24) తక్కువ పరుగులకే వెనుదిరిగినా ఓపెనర్‌గా నిలిచిన శాయ్‌ హోప్‌ అడ్డుగోడల నిలిచి ఆడాడు. 45 బంతుల్లో 102 పరుగులతో రికార్డు సెంచరీ నమోదు చేశాడు. 226 స్ట్రైక్‌ రేట్‌తో ఆడిన హోప్‌ 6 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హోప్‌కు చక్కటి భాగస్వామ్యం అందించిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ అద్భుతంగా ఆడి 37 బంతుల్లో 84 పరుగులు బాదాడు. ఏడేసి ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. రొమారియో షెఫర్డ్‌ 34 పరుగులు చేసి 9 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బంతులు వేసిన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. బౌలర్లందరూ బంతులు వేసినా హోప్‌ను ఔట్‌ చేయలేకపోయారు. మయాంక్‌ యాదవ్‌ మూడు వికెట్లతో సత్తా చాటినా మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. కుల్దీప్ యాదవ్‌ ఒకే వికెట్‌కు పరిమితమయ్యాడు. అద్భుత విజయం సాధించి భారత్‌కు షాక్‌ ఇచ్చిన వెస్టిండీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య 11వ తేదీన మూడో మ్యాచ్‌ జరగనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES