Delimitation Bill: దేశ రాజధాని హస్తినలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై నరేంద్ర మోడీ సర్కార్ మళ్లీ ఫోకస్ చేసింది. ఈ వారంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏప్రిల్‌లో కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ సభల వీగిపోయింది. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకుంది. ఈసారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ సాధించాలనే పట్టుదలతో మోడీ టీం ఉంది. ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలు,విపక్ష కూటమిలోని చీలికలు ప్రభుత్వానికి కొత్త బలాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ఈ ప్రత్యేక సమావేశాల వ్యూహం ఏంటి? బిల్లును గట్టెక్కించేందుకు మోడీ-షా దగ్గరున్న అసలు ప్లాన్ ఏమిటి?