• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ప్రజాందోళనలతో అట్టుడుకుతున్న ఐరోపా.. ప్రజాందోళనతో హింసాత్మక ఘటనలు..

ప్రజాందోళనలతో అట్టుడుకుతున్న ఐరోపా.. ప్రజాందోళనతో హింసాత్మక ఘటనలు..

Europe public unrest: యూరప్‌లో ప్రజాగ్రహం పెల్లుబుకింది. పాలకులు అధికారం నుంచి తప్పుకోవాలనే డిమాండ్ తో దేశాలు కాదు… ఖండమే అట్టుడుకుతోంది. ఐరోపా ఖండం ప్రస్తుతం అగ్నిగుండంగా మారిపోయింది. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలను తగులబెడుతున్నారు. దుకాణాలను లూటీ చేస్తున్నారు. యూరప్ ఖండానికి ఎందుకొచ్చింది ఈ దౌర్భాగ్యం? పాలకుల్లో సమర్థత లోపమా? వ్యవస్థీకృత వైఫల్యమా? ప్రజలకు శాపమా? ఇంతకీ యూరప్‌లో ఏం జరుగుతోంది..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 05:29 AM IST|Updated: Oct 25, 2026, 05:30 AM IST
joinshare
ప్రజాందోళనలతో  అట్టుడుకుతున్న ఐరోపా.. ప్రజాందోళనతో హింసాత్మక ఘటనలు..
Image Credit: Europe Unrest (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఈ వారంలోనే మళ్లీ ‘ఢీ’ లిమిటేషన్ బిల్లు.. ఉభయ సభల్లో మోడీ- షా ప్లాన్ ఏంటి..?

ఈ వారంలోనే మళ్లీ ‘ఢీ’ లిమిటేషన్ బిల్లు.. ఉభయ సభల్లో మోడీ- షా ప్లాన్ ఏంటి..?

2

ప్రజాందోళనలతో అట్టుడుకుతున్న ఐరోపా.. ప్రజాందోళనతో హింసాత్మక ఘటనలు..

3

Kavitha Interview: బిగ్‌ డిబేట్‌ విత్‌ భరత్‌ ఇంటర్వ్యూలో పేపర్ బ్యాలెట్‌కు 'జై' కొట్టిన కవిత

4

Pydithalli Sirimanu: 350 ఏళ్ల చారిత్రక.. ఆధ్యాత్మిక ఉత్సవం విజయనగర పైడితల్లి సిరిమాను

5

Seethakka Emotional: తన రాజకీయ జీవితంపై భావోద్వేగానికి లోనయిన సీతక్క

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Europe Regime change Operation: ఒకప్పుడు ప్రపంచాన్ని శాసింసిన ఇంగ్లాండ్ కొలువైన ఖండం యూరోప్. ఓ వైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు  అధికార యంత్రాంగం వైఫల్యాలతో ఐరోపా సతమతమవుతోంది. పెరుగుతున్న ధరలు, డీజిల్ కొరత, మౌలిక వసతుల లేమి ఇలా సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ప్రజలు చేపట్టిన ఆందోళనతో ఐరోపాలోని అనేక దేశాలు మండిపోతున్నాయి.

ఫ్రాన్స్‌లో విద్యార్ధుల ఆందోళనతో ఐరోపా అంతటా దావానంలా వ్యాప్తి.. 
విద్యారంగం సమస్యలతో మొదలైన నిరసనలు.. ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు గత నెలలో చిన్నగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, టీచర్లకు విద్యా ఫండ్‌ చెల్లించాలని రాజధాని పారిస్‌లో స్థానికంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కళాశాలల్లో తరగతులు స్తంభించాయి. చమురు ధరలు కూడా ఫ్రాన్స్‌లో భారీగా పెరిగిపోయాయి.

వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ లూటీ..

వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో ఐరోపా అగ్ని గుండంలా మండుతోంది. చాలా రోజులుగా గూడుకట్టుకున్న అసంతృప్తిని ప్రజలు నిరసనల రూపంలో వెల్లడిస్తున్నారు. ఐరోపాలోని బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, గ్రీస్‌, బెల్జియం, అల్బేనియా, పోర్చుగల్‌, హంగరీ, ఎస్తోనియా, మాల్టోవా ఇలా ప్రతి దేశం ఆందోళనలతో అట్టుడుకుతోంది.

పెరిగిన జీవన వ్యయాలు..

ఐరోపాలో ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో పాటు జీవన వ్యయాలు పెరగడం తీవ్ర సమస్యగా మారింది. ఆందోళనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. దాదాపు ప్రతి దేశంలోనూ ప్రజలు ఒకే రకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రాన్స్‌ హోం మంత్రి చెప్పిన దాని ప్రకారమే ఐదున్నర లక్షల మంది నిరసనల్లో పాల్గొంటున్నారు. ఒక్క పారిస్‌లోనే ఈ సంఖ్య లక్షా పదివేలుగా ఉంది.

ఫ్రాన్స్‌లో త్వరలో ఎన్నికలు.. 

ఫ్రాన్స్‌లో త్వరలో ఎన్నికలు జరగనుండగా ప్రజల ఆందోళనలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రెన్‌కు ఇబ్బందిగా మారాయి. బెల్జియంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. విశ్వవిద్యాలయాల్లో భారీగా పెంచిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లించేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు. రాజధాని బ్రసెల్స్‌లో శనివారం ఆందోళనలు జరగగా పోలీసులు వాటర్‌ కేనన్‌లను ప్రయోగించారు. బెల్జియం హోం మంత్రి నిరసనకారులను అల్లర్లు సృష్టించేవారిగా అభివర్ణించారు.

పోర్చుగల్‌లో ప్రజా ఆందోళన.. 

ధరల పెరుగుదల, తక్కువ వేతనాలను నిరసిస్తూ పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో వేలాది మంది ఆందోళనకు దిగారు. లిస్బన్‌ సహా పోర్చుగల్‌లోని అనేక నగరాల్లో 2017 నుంచి ఇళ్ల ధరలు రెట్టింపయ్యాయి. అద్దెలు కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగాయి. లిస్బన్‌ వంటి నగరాల్లో ఆదాయానికి అద్దెలకు పొంతనే ఉండడం లేదు. దీంతో స్థానిక కార్మికుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ఇక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తింది.

ఫ్రాన్స్‌లో  కాకుండా పోర్చుగల్‌లో నిరసనలు తక్కువ వేతనాలు, ఇళ్ల ధరల అంశానికే పరిమితం అయ్యాయి. అల్బేనియాలో ఇటీవల చదువుకు అయ్యే ఖర్చు పెరిగింది. విశ్వవిద్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లోపించాయి. ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. దీంతో వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అక్టోబర్‌ 13న రాజధాని తిరాన్‌లో విద్యాశాఖ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలు హింసారూపం దాల్చాయి.

స్పెయిన్‌లో పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన జరుపుతున్నారు. గృహాలను కనీస అవసరంగా గుర్తించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. స్పెయిన్‌లో దాదాపు 7లక్షల 50వేల ఇళ్ల కొరత ఉందని ఓ నివేదిక వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా స్పెయిన్‌ ప్రధాని శాంచెజ్‌ కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించారు. అయితే పార్లమెంటు దాన్ని తిరస్కరించింది.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల నిరసనలు...

ఇటలీలో హైస్కూల్‌ విద్యార్థులు పాఠశాలలను ఆక్రమించి మార్చ్ నిర్వహిస్తున్నారు. విద్యకు నిధుల కొరత, జీవన వ్యయాల పెంపుపై ఆందోళనలు జరుగుతున్నాయి. గ్రీస్‌లో ప్రభుత్వ విద్యకు నిధుల కొరత, జీవన వ్యయాల పెంపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఇళ్ల అద్దెలు, ధరల పెరుగుదల ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఐర్లాండ్‌ను అత్యంత ఖరీదైన దేశంగా పిలుస్తారు. అయితే ఇక్కడ కూడా యుటిలిటీ, ఇళ్లు, ఆరోగ్య సేవల ధరలు భారీగా పెరిగాయి. ప్రతి మూడో కుటుంబం నిత్యావసరాలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు.

ఇటు ప్రకృతి వైపరీత్యం - అటు పాలకుల నిర్లక్ష్యం..

ప్రజాందోళనలతో అట్టుడుకుతున్న ఐరోపాలో పరిస్థితులు సద్దుమణిగేలా కన్పించడంలేదు. ఏళ్ల తరబడిన నిర్లక్ష్యంతో విద్యారంగ వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయి. ఐరోపాలో సమస్యలను అధ్యయనం చేసి పొరుగు దేశాలు ఆర్థికంగా ఆదుకుంటేగానీ… సమస్యల పరిష్కారానికి మార్గం దొరికే పరిస్థితి కనుచూప మేరలో కనిపించడం లేదని  అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చెబుతున్నాయి. మానవతా దృక్పథంతో ఆదుకోడానికి ముందుకు వచ్చే దేశాలేవి? ఆర్థికంగా చేయూతనిచ్చేది ఎవరు ? ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోక ముందే ప్రపంచ దేశాల్లో మానవతా వాదులు ఐరోపాలో ప్రజాందోళనలు గుర్తించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Trending News
Donald Trump