Food Poison: దసరా పండుగ ముందు రోజు కలకలం.. మేక మాంసం తిని 14 మందికి అస్వస్థత
14 Persons Hospitalised After Eat Mutton In Dussehra: బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ అని సంబరాలు ముందే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సందర్భంగా మేక మాంసం వండించి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తినగా.. కొన్ని గంటల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Food Poison In Dussehra: దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ సందర్భంగా ఆ గ్రామమంతా ఒక చోటుకు చేరింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆ గ్రామం కళకళలాడింది. ఈ సందర్భంగా ఓ కుటుంబం బంధుమిత్రులతో కలిసి విందు చేసుకున్నారు. ఈ సందర్భంగా మేక మాంసం వండుకుని తిన్నారు. అయితే తిన్న కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో బంధుమిత్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ గ్రామంలో కలకలం ఏర్పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోని పిట్లం మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం అన్నారం తండాలో విజయదశమి పండుగ సందర్బంగా సోమవారం ఒకరోజు ముందు సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల సందర్భంగా ఏర్పాటుచేసిన విందులో మేక మాంసం బంధుమిత్రులు ఆరగించారు. భోజనాల అనంతరం తిన్న వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ప్రతి యేటా మాదిరిగా రాత్రి అన్నారం తండాలో నిర్వహించిన మేక మాంసం తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పెద్దలు, మరో నలుగురు చిన్నారులు ఉన్నారు.
తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బంధువుల సహాయంతో బాధితులను చికిత్స నిమిత్తం పిట్లంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. దీంతో తండాలో ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అస్పత్రి వైద్యుడు డాక్టర్ రవీంద్ర మోహన్ వెల్లడించారు.