SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Indiramma Sarees: నల్లమల్ల గడ్డపై నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ.. పూర్తి వివరాలు ఇవే!

26th Indiramma Sarees Distribution Will Launch In Achampet: దసరా పండుగకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ చీరలు భారత రాజ్యాంగ దినోత్సవం నాడు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి నల్లమల్ల గడ్డపై నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 24, 2026, 16:03 IST | Updated: Nov 24, 2026, 16:05 IST
Image Credit: Indiramma Chiralu
Join

Telangana Indiramma Chiralu: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గతంలో బతుకమ్మ చీరల పేరిట దసరా పండుగకు ముందు మహిళలకు అందించేది. కాంగ్రెస్‌ వచ్చాక బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టి చీరల పంపిణీని ఇష్టమొచ్చిన సమయంలో పంపిణీ చేస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయగా.. ఈ ఏడాది భారత రాజ్యాంగ దినోత్సవం నాడు చీరల పంపిణీ చేపట్టనున్నారు. అయితే ఈసారి నల్లమల్ల గడ్డపై నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఈ నెల 26న అచ్చంపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి చీరల పంపిణీని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తన పుట్టినగడ్డ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను కానుకగా అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గతంలో ఒకే రంగులో చీరలు రూపొందించగా.. ఈ సారి మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. చీరల నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది.

ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా ప్రభుత్వం రెండు రకాల చీరలను సిద్ధం చేసింది. 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ చీరలను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత కార్మికులతో తయారు చేయించారు. మహిళలకు చీరలను కానుకగా అందించటంతో పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇందిరమ్మ చీరలు పొందాలంటే రేషన్‌ కార్డు ఉంటే చాలు. రేషన్​ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏండ్లు నిండిన మహిళలందరూ చీరలు తీసుకునేందుకు అర్హులు అని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్​ సిబ్బంది చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. పారదర్శకంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES