Acb officials raids in medchal keesara police station: తెలంగాణలో ఇటీవల అనేక శాఖలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాధితుల సమాచారంలో లంచాలు డిమాండ్ అవినీతి అనకొండలను వలపన్ని మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి చోట ఏదో ఒక శాఖలో వెలుగులోకి వస్తుంది. అక్రమార్కులను పట్టుకుని ఏసీబీ అధికారులు వారిని అరెస్టులు చేస్తున్నారు. అయిన కూడా కొంత మంది ప్రభుత్వ అధికారులు తమ తీరును మార్చుకొవడంలేదు. బాధితుల అవసరాలను అడ్డంపెట్టుకుని లంచం డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న కీసర పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు బుధవారం అర్దరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పీడీఎస్ బియ్యం ఘటనలో అడ్డంగా దొరికిన కేసులో సదరు వ్యక్తికి బెయిల్ కోసం.. రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఇక కీసర సమీపంలో చెరువు వద్ద కారులో రూ.5 లక్షలను ఎస్సై స్వీకరించాడు. ఆతర్వాత ACB అధికారులను చూసి ఎస్సై పరుగులు పెట్టాడు.ఆ తర్వాత పీఎస్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.10 లక్షల లంచం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు డిమాండ్ చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు.
అయితే తొలి విడతగా.. రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా డీల్ కుదిరినట్లు తెలుస్తొంది. అయితే.. కెమికల్ టెస్ట్‌ల విషయంలో కూడా బాధితుడిని ఇన్స్పెక్టర్, ఎస్సై ముప్పుతిప్పలు పెట్టినట్లు చెబుతున్నాడు.
గత కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని వేధింపులకు సైతం గురిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక ACBని బాధితుడు ఆశ్రయించాడు. ఈ క్రమంలో.. ACB డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయాలు, ఇండ్లలోను ఏసీబీ సోదాలు చేపట్టింది.