SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ముగిసిన దసరా సెలవులు..నగరం బాట పట్టిన జనం..

Dasara Holidays: దసరా పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు మళ్లీ రాజధాని హైదరబాద్ బాట పట్టారు. పల్లెల్లో వేడుకలు ఘనంగా ముగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో నగరానికి దారితీసే అన్ని ప్రధాన రోడ్లన్ని జనసందోహంతో, వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మళ్లీ ప్రారంభం కానుండటంతో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి నగరానికి పోటెత్తుతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 10:29 AM IST | Updated: Oct 22, 2026, 10:31 AM IST
Image Credit: Dasara Holidays (ZEE News Telugu/Source)
Join

Dasara Traffic Jam: విజయ దశమి సెలవుల తర్వాత పండగ చేసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ నగరానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు.  దీంతో శివారు రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ రహదారితో పాటు వరంగల్–హైదరాబాద్ మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులకు రోడ్లపై చుక్కలు కనిపిస్తున్నాయి.

టోల్ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ.. 
బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, బీబీనగర్ సమీపంలోని రాయగిరి, గూడూరు టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. చౌటుప్పల్ సమీపంలో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రత్యామ్నాయ మార్గాలు.. 
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీలక జంక్షన్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు.చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు వైపు సాఫీగా మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండేందుకు ఫాస్టాగ్‌ స్కానర్లను ముందస్తుగానే తనిఖీ చేసి, అదనపు సిబ్బందితో హ్యాండ్‌హెల్డ్ మెషీన్ల ద్వారా ఫాస్ట్‌గా టోల్ రుసుము వసూలు చేసేలా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వాహనాలు, అంబులెన్సుల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించారు.

ప్రధాన మార్గాల్లో పోలీస్ గస్తీ..

మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రాకతో రద్దీగా మారాయి. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయి నగరానికి చేరుకుంటున్నాయి. వెహికల్స్  రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రధాన మార్గాల్లో గస్తీ ముమ్మరం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES