SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

Rice Price Increase: ఆశించిన స్థాయిలో వరి సాగు దిగుబడులు వచ్చినప్పటికీ.. కృత్రిమ కోరత కారణంగానే బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఉన్నట్టుండి దాదాపు 500 నుంచి 700 వరకు బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులపై విపరీతమైన భారం పడుతుంది.. దీనికి ప్రధాన కారణం కృత్రిమ కోరుతూనేనని వినియోగదారుల భావిస్తూ వస్తున్నారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 08:16 PM IST | Updated: Oct 18, 2026, 08:17 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Rice Price Increase: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో వంటింటి బడ్జెట్ తలకిందులౌతూ వస్తోంది. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఆహారంగా భావించే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నాయి. ఇప్పటికే నిత్యవసరాలతో పాటు కూరగాయ ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలపై ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల మరో పిడుగుల పడింది. ఒకవైపు గుడ్ల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి.

వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కనిపించినప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు శ్రమించి విస్తారంగానే వరి సాగు చేపట్టారు.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆశించిన స్థాయిలో దిగుబడును వచ్చినప్పటికీ.. మార్కెట్లో మాత్రం బియ్యానికి తీవ్ర కోరత ఉన్నట్లు కృత్రిమ వాతావరణన్ని సృష్టిస్తున్నారని ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. పరువు పరిస్థితులతో పాటు వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపి కొందరు మిల్లర్లతో పాటు హోల్సేల్ వ్యాపారులు భారీగా నిల్వలు దాచిపెట్టి రేట్లను పెంచుతున్నారనే విమర్శలు మెండుగా వస్తున్నాయి..

గత కొద్ది రోజుల్లోనే 26 కిలోల బస్తా బియ్యం పై దాదాపు రూ. 500 నుంచి రూ. 700 వరకు పెరిగింది. సాధారణంగా కుటుంబాలు ఎక్కువగా వినియోగించే నాణ్యమైన బియ్యం 26 కేజీల బ్యాగు కొనాలంటే ఇప్పుడు కనీసం రెండు వేల రూపాయలకు పైగాని చెల్లించాల్సి వస్తుందంటే నమ్మశక్యంగా లేదు కదా..

బహిరంగ మార్కెట్లో నాణ్యమైన బియ్యం కిలో రూ.75 నుంచి రూ.90 రూపాయల వరకు పలుకుతోందట.. మార్కెట్లో ఇదే పోకడ కొనసాగితే రాబోయే రోజుల్లో కిలో బియ్యం దాదాపు రూ.100 దాటిన ఆశ్చర్యం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..

సాధారణంగా నలుగురు సభ్యులు ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబానికి నెలకు కనీసం 25 నుంచి 30 కిలోల బియ్యం అవసరం అవుతూ ఉంటాయి. కేవలం బియ్యం కోసమే గతంలో నెలకు రూ.1200 నుంచి రూ.1400 వరకు ఖర్చయ్యేది.. కానీ ప్రస్తుతం ధరలు ప్రకారం నెలకు బియ్యానికి దాదాపు రూ.2000 నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది.. దీంతో ఇతర కుటుంబ ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి..

రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పాటు అటు వినియోగదారులకు మాత్రం అధిక ధరలు చేరడం వెనుక దళారులతో పాటు వ్యాపారుల లాభపేక్షే కారణమని స్పష్టమవుతుంది. నిత్యవసర ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ తక్షణమే తనిఖీలు నిర్వహించి.. అక్రమ నిల్వలను అరికట్టాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES