• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!

ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్నింటిని రీ హీట్ చేయకూడదని వైద్యులు స్వయంగా హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా మన రోజువారీ వంటల్లో ఈ ఐదు పదార్థాలను మళ్లీ వేడి చేయకూడదు. ఆ జాబితా ఏంటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 18, 2026, 07:32 PM IST|Updated: Oct 18, 2026, 07:34 PM IST
joinshare
ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!
Image Credit: 6 Foods You Should Never Reheat

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

2

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

3

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

4

ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!

5

AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

foods you should never reheat: ఉదయం వండిన ఆహారం సాయంత్రానికి చల్లారిపోతుంది. కాబట్టి చాలామంది దాన్ని రీ హీట్ చేసుకుంటూ ఉంటారు. అయితే, కొన్ని పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉండటమే కాకుండా, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. వైద్య నిపుణుల ప్రకారం, రీ హీట్ చేయకూడని ఆహారాల జాబితా ఏంటో తెలుసుకుందాం.

రీ హీట్ చేయకూడని పదార్థాల జాబితాలో మొదటిది అన్నం. అన్నం చల్లబడిందని దానిని మళ్లీ వేడి చేయకూడదు, ఇది ఫుడ్ పాయిజన్‌కు దారితీస్తుంది. అన్నాన్ని గంటల కొద్దీ రూమ్ టెంపరేచర్ వద్ద వదిలేసినప్పుడు అందులో బ్యాసిల్లస్ సీరియస్ అనే బ్యాక్టీరియా చేరి టాక్సిన్స్ పేరుకుపోతాయి. రీ హీట్ చేయడం వల్ల ఈ టాక్సిన్స్ నశించవు, దీనివల్ల అజీర్తి, వాంతులు మరియు డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.

అదేవిధంగా, ఆలుగడ్డలను కూడా పొరపాటున కూడా రీ హీట్ చేయకూడదు, వీటిని ఫ్రిజ్‌లో కూడా ఉంచకూడదు. ఆలుగడ్డల్లో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వీటిని మళ్లీ వేడి చేయడం వల్ల టాక్సిన్స్ స్థాయి పెరిగి జీర్ణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న ఆలుగడ్డలనే కొనుగోలు చేసి వాడాలి.

గుడ్లతో మనం రకరకాల వంటకాలు చేసుకుంటాము. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్ల ప్రాధాన్యత చాలా ఎక్కువ. అయితే, గుడ్లను కూడా పొరపాటున కూడా రీ హీట్ చేయకూడదు. వీటిని మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లి, అజీర్తికి దారితీస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్లను కేవలం తాజాగా, వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం మంచిది.
రీ హీట్ చేయకూడని ఆహారాల జాబితాలో చికెన్ కూడా ఉంది. గతంలో మళ్లీ వేడి చేసిన చికెన్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఒకసారి వండిన తర్వాత దానిని మళ్లీ రీ హీట్ చేయకండి. అలా చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా నశించకపోవచ్చు.

మష్రూమ్స్ కూడా ఈ జాబితాలోకి వస్తాయి. వీటిని రీ హీట్ చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి మరియు అందులోని ఖనిజాలు కూడా కోల్పోతాము. కాబట్టి తాజాగా తెచ్చిన మష్రూమ్స్‌ను మాత్రమే వండుకోవడం ఆరోగ్యకరం.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

చివరగా, పాలకూర కూడా రీ హీట్ చేయకూడని జాబితాలో ఉంది. పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు ఉంటాయి, ఇవి రీ హీట్ చేసినప్పుడు ప్రమాదకరమైన నైట్రైట్లుగా మారిపోతాయి. ఇది రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలకు పాలకూర పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రీ హీట్ చేసిన పాలకూర తినడం మంచిది కాదు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health