Balapur Ganesh Shobha Yatra : బాలాపూర్ వినాయకుడికి సంబంధించి ఉదయం 5 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణేష్ చివరి ప్రత్యేక పూజ నిర్వహించారు. పూజ ముగిసిన అనంతరం క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని మినీ ట్రక్కుపై ప్రతిష్ఠించారు. బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. బాలాపూర్ గణేష్ గ్రామ ప్రదక్షిణ బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన, చారిత్రాత్మకమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు కదులుతుంది.
1994లో రూ.450లో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలం..
1994లో కేవలం 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం, గడిచిన 30 ఏళ్లలో లక్షల రూపాయలకు చేరుకుంది. మరి ఈసారి 2026 వేలంలో బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి. గతేడాది బాలాపూర్ లడ్డూ వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రికార్డు స్థాయిలో 35 లక్షలకు ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
2024 వేలంలో ౩౦ లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. 2024 లో లడ్డూను సొంతం చేసుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. 2023 వేలంలో 27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ. 2023 లో లడ్డూను సొంతం చేసుకున్న దాసరి దయానంద్ రెడ్డి. 2022 వేలంలో 24.6 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ దాన్ని సొంతం చేసుకున్న కె. లక్ష్మారెడ్డి.
2021 లో 18,90 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ . 2021 లో సొంతం చేసుకున్న మర్రి శశాంక్ రెడ్డి & రమేష్ యాదవ్ . లడ్డూ వేలం అనంతరం ప్రారంభంకానున్న బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమై పాతబస్తీ మీదుగా అఫ్జల్ గంజ్, మోజంజాహి మార్కెట్, ఆబిడ్స్ మీదుగా ట్యాంక్ బండ్‌కు చేరుకోనుంది.