SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బాసరలో శారదీయ నవరాత్రుల ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రి రూపంలో సరస్వతిదేవి దర్శనం..

Basara Saraswati Temple: బాసర క్షేత్రంలో శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమ్మవారు శైలపుత్రి దివ్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అయితే భక్తులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే అధికారులను ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపట్టినట్లు తెలుస్తోంది..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 11:44 AM IST | Updated: Oct 11, 2026, 11:45 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Basara Saraswati Temple News: తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా భావించే చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రుల ఉత్సవాలు ఈ రోజు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చక బృందం తో పాటు వేద పండితులు ఉదయం తెల్లవారు జామున బాల ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు నిర్వహించి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా కట్టెపొంగలిని నైవేద్యంగా సమర్పించారు.

నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి దివ్య అలంకరణలో భాగంగా భక్తులందరికీ దర్శనమిచ్చారు. పర్వతా రాజైన హిమవంతుని ఇంట పుత్రికగా అవతరించిన కారణంగా అమ్మవారికి శైలపుత్రి అనే పేరు వచ్చింది. పూర్వజన్మలో దక్షిణ ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవిగా జన్మించి.. దక్షయజ్ఞంలో జరిగిన పరాభావాన్ని సహించలేక యోగాగ్నిలో ఆత్మహుతి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత జన్మలో పార్వతీదేవిగా.. శైలపుత్రిగా.. అవతరించి.. అత్యంత నిష్టతో కూడిన కఠినమైన తపస్సు ఆచరించి తిరిగి ఆ పరమశివుడినే పతిగా పొందింది..

ఈ రూపంలో అమ్మవారు వృషభంపై ఆసీనురాలై భక్తులకు అభయమయిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. అందువల్లే దీనిని వృషారూఢా అని కూడా పిలుస్తూ ఉంటారు.  ద్విభుజ రూపంలో ఒక చేతిలో త్రిశూలం.. మరో చేతిలో పద్మం ధరించి పరమ శాంత గంభీర వదనంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు.. ఈ దర్శనంలో భాగంగా భక్తులు అమ్మవారిని పూజిస్తే కోరుకున్న కోరికలు జరుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి..

యోగ సాధన ప్రక్రియలో శైలపుత్రి అవతారానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. మానవ శరీరంలోని అన్ని చక్రాలలో మొదటిదిగా భావించి మూలాధార చక్రానికి ఈమె అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుంది. రాత్రుల్లో తొలి రోజున అందరూ తమ దృష్టిని.. మనస్సును మూలాధార చక్రంపై లగ్నం చేసి ధ్యానం ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆధ్యాత్మిక ప్రయాణానికి అద్భుతమైన పునాది ఏర్పడుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే జాతకంలో చంద్రుని ప్రతికూల ప్రభావం లేదా చంద్ర దోషాలతో బాధపడే వారికి శైలపుత్రి దేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయట. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి..

భక్తుల కోసం ఏర్పాట్లు..
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఉదయం నుంచి బాసర క్షేత్రం భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన క్యూలైన్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పకడిబందీగా పూర్తి చేశారట. గోదావరి తీరంలో భక్తులు స్నానాలతో పాటు బస ఏర్పాట్లను నిరంతరం అధికారులు పర్యావక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES