• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /బతుకమ్మ, దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు!

బతుకమ్మ, దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు!

Telangana Dasara Holidays: బతుకమ్మతో పాటు దసరా పండగల కారణంగా హైదరాబాదులో నివసించే చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. దీంతో జూబ్లీహిల్స్ బస్ స్టేషన్‌తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ లకు సెలవులతో పాటు కళాశాలలకు ప్రత్యేకమైన దసరా సెలవులు అందించడంతో విద్యార్థులతో పాటు కొంతమందికి ఉద్యోగులు కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 12:11 PM IST|Updated: Oct 11, 2026, 12:12 PM IST
joinshare
బతుకమ్మ, దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Prabhas vs Rajamouli: ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. ఇద్దరు పాన్ ఇండియా దిగ్గజాల బిగ్ క్లాష్?

Prabhas vs Rajamouli: ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. ఇద్దరు పాన్ ఇండియా దిగ్గజాల బిగ్ క్లాష్?

2

Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

3

Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

4

Chiranjeevi: చిరంజీవి ఒక్క ఫోన్ కాల్‌తో సెన్సార్ సమస్యలు పరిష్కారమవుతాయా?

5

వంటగ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఇక మరింత ఈజీ.. వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌తో నిమిషాల్లో ఇలా బుక్ చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Dasara Holidays: తెలంగాణలో అతి పెద్ద పండుగగా భావించే బతుకమ్మ, దసరా పర్వదినాలను పురస్కరించుకొని నగరంలో ఉద్యోగాల కోసం వచ్చిన  వారు తమ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. పాఠశాలలతో పాటు కళాశాలలు, అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటించడంతో హైదరాబాదులో పండగ సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది.. కుటుంబ సమేతంగా పండగ జరుపుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లడంతో సికింద్రాబాద్లోని జూబ్లీహిల్స్ బస్ స్టేషన్, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి.. ఎటు చూసినా ప్రయాణికులే కనిపిస్తున్నారు..

ఉత్తర తెలంగాణ జిల్లాలైన.. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్, మెదక్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వేలాదిమంది ప్రయాణికులు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లాపాపలతో లగేజీ సంచులతో బస్టాండ్ ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్లాట్ఫామ్స్ పై వేసి చూస్తూ ఉన్నారు. వాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.. జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ కోచ్‌లలోనూ విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.

పండగ సీజన్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వ కింద పని చేస్తే దక్షిణ మధ్య రైల్వే అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డిపోల నుంచి తనకు బస్సులను కూడా రోడ్లపైకి తీసుకొస్తున్నారు.. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో సాధారణ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలుమార్గాల్లో ప్రత్యేకమైన రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు అదనపు బుకింగ్ కౌంటర్ల తో పాటు ప్రత్యేకమైన ప్లాట్ఫాములపై ప్రయాణికులకు మార్గదర్శం చేసేందుకు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా నియమించినట్లు తెలుస్తోంది.. భారీ రద్దీ నేపథ్యంలో బస్టాండ్లతో పాటు రైల్వేస్టేషన్లో ఇలాంటి అవంచనీయ ఘటనలు.. చోరీలు జరగకుండా పోలీసు తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు సైతం తొందరపడకుండా అధికారుల సూచనలు పాటించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని రవాణా విభాగం అధికారులు సూచిస్తూ ఉన్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Hyderabad