SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth Reddy: కోవిడ్ తరహాలో మరో సంక్షోభం.. ఎల్ నినోపై సీఎం రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..

CM Revanth reddy on elnino effect: శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు హెచ్చరించినట్టుగానే ఎల్ నినోపై పరిస్థితులు చేయి దాటాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా 2019-20లో కోవిడ్‌తో ప్రపంచమే స్తంభించిపోయిందని, ఇప్పుడు అలాంటి మరో సంక్షోభం ఎదురవుతోందని చెప్పుకొచ్చారు.

Written By Inamdar Paresh
Published: Oct 15, 2026, 08:17 PM IST | Updated: Oct 15, 2026, 08:28 PM IST
Image Credit: cm revanth reddy on elnino press meet
Join

CM Revanth reddy press meet on elnino crisis: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏర్పడిన ఎల్ నినో ప్రభావంపై, కరువు  పరిస్థితులను ఏవిధంగా ఎదుర్కొవాలి, భవిష్యత్ కార్యాచరణ ఏవిధంగా ఉండాలో అన్నదానిపై అధికారులు, మంత్రులతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వంద దేశాలపై ఉందని అంచనా వేశారు. అంతే కాకుండా.. గతంలో శాస్రవేత్తలు ఉహించినట్లు గానే జరుగుతోందని, కోవిడ్ తరహా సంక్షోభామ్ మళ్లీ కనిపిస్తోందని ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ సారి వచ్చిన కరువు వల్ల జంతువులను జీవరాశులను కాపాడుకుంటూనే మనుషులకు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. వర్షాలు లేకపోవడం వల్ల విద్యుత్ పై ప్రభావం పడుతోందని అన్నారు. వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయని,  ఆ తరహ పంటలు వేసుకోవాలని ఇప్పటికే చెప్పామన్నారు. కానీ చాలా మంది రైతులు ఇతర పంటలను వేసి ఇబ్బందులు పడ్డారన్నారు.


మార్చిలో ఉండాల్సిన వేడి ఇప్పుడు నమోదౌతోందని, నీటికి ఇబ్బంది ఎదురౌతుందని అన్నారు. మార్కెట్ డిమాండ్ బట్టీ విద్యుత్ ను సరఫరా చేశారని, అదనంగా ఇప్పడు 14 వేల మెగావాట్ల ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. వర్షకాల పంటలను కాపాడుకుంటూనే ఎండిపోకుండా జాగ్రత పడ్డారని, ఎల్ ని నో అనేది ప్రకృతి విపత్తుగా పరిగణించిందని అన్నారు. 2026 సంవత్సరం ప్రారంభం నుండి వణికిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో కలిపి 209 టీఎంసీల నీళ్లే ఉన్నాయన్నారు.

చాలా రోజుల నుండి నిపుణులు, శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నట్లుగానే.. ఎల్ నీనో ప్రభావం చూపిస్తుందని మాట్లాడారు. ఈ ప్రభావం పంటల మీద జీవన విధానం మీద ప్రభావం పడుతుంది.. అందుకే ముందస్తు సూచనలు కూడా చేశామని కానీ.. 13 లక్షల మంది రైతులు వేరే పంటలు వేశారని, 56 లక్షల మంది వరి పండించారనిచెప్పారు.అసలైతే 15 వేల మెగావాట్ల ఉండాలి కానీ ఇప్పుడు 20 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం వస్తుందన్నారు. మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగo పెరిగిందని గుర్తు చేశారు. ఎండాకాలంలో ఉండాల్సిన ఎండలు ఇపుడే విపరీతంగా ఉందని, 20 వేల 3 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తున్నారన్నారు.

రైతులకు, పరిశ్రమలకు విద్యుత్ ను అందిస్తున్నామని.. రైతులకు విజ్ఞప్తి చేయబోతున్నామన్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడాలని,  నీళ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి పొదుపుగా వాడాలని సూచించారు.  వచ్చే రబీ సీజన్ ను వరిని వాయిదా వేసుకోవాలన్నారు.

పంట లేకుంటే పేదలకు కూడా నష్టం ఉంటుందని అది కూడా పరిగణలోకి తీసుకోబోతున్నామన్నారు.  ప్రకృతి విపత్తు ను దృష్ట్య  60 శాతం 40 శాతం మనం భరించి ఆదుకొంటాం అందుకు కేంద్రం సహకారం కోరబోతున్నామన్నాని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES