తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తూ, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాలు తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం ఏపీలోని కోస్తా జిల్లాలకే వర్షాలు పరిమితమయ్యాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండి తేల్చింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, అవి పెద్దగా ప్రభావం చూపలేవని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాల్లో ఈ రోజు నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Rains: తెలంగాణలో ఇక వర్షాలకు ఛాన్స్ లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పలు మార్పుల మూలంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Heavy Rains in Telangana & AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం, రేపు ఉదయానికి అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.
Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఈ నేపథ్యంలో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్’ ఎలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Imd heavy rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ బులెటిన్‌లో స్పష్టం చేసింది
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మొత్తం ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో అతిభారీ వర్షాలంటూ IMD హెచ్చరిక జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడనున్నాయి.
Heavy rains in Telangana: ముఖ్యంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తు ఐఎండీ కీలక సూచనలు చేసింది.