SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: పోలీసు డిపార్ట్ మెంట్ కు భారీ శుభవార్త.. అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన..

Police Commemoration Day Parade: ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో సొంత కాళ్లపై నిలబడేలా పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ నిర్ణయం తీసుకున్న పోలీస్ శాఖపై సీఎం ప్రశంసలు కురిపించారు.

Written By Inamdar Paresh
Published: Oct 21, 2026, 02:32 PM IST | Updated: Oct 21, 2026, 02:40 PM IST
Image Credit: cm revanth reddy in goshamahal speech
Join

CM Revanth reddy speech in goshamahal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గోషామహాల్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి అసువులు బాసిన పోలీసులకు ఘటన నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా పోలీసు శాఖలో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ప్రజల భద్రత , దేశం కోసం డిపార్ట్ మెంట్ సేవలు ఎప్పటికి మరువలేనివన్నారు. పోలీసులు విధి నిర్వహణ వల్లనే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులను ఎప్పటికి మరువబోమని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. 

 

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 4,773 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. దీనితో పాటు 2028 నాటికి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా.. ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో సొంత కాళ్లపై నిలబడేలా పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించిందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న పోలీస్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. విధి నిర్వహణలో అమరులైన.. కానిస్టేబుళ్లకు 1 కోటి రూపాయలు.. SI, ఇన్ స్పెక్టర్లకు 1 కోటి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాను పెంచారు.

DSP స్థాయి అధికారులకు 1 కోటి 50 లక్షల రూపాయలు.. SP స్థాయి అధికారులకు 2 కోట్ల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియా పెంపుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హోంగార్డులకు కూడా అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటి వరకు 16 వేల పోలీస్ కొలువులు భర్తీ చేశామని, మరో 5 వేల పోస్టులకు అనుమతి ఇచ్చామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..  పోలీస్ శాఖలో 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించినట్లు సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం దక్కేలా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ పోలీసు శాఖకు పలు సూచనలు చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES