SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా: రూ.10 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటన!

Conductor Pravallika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక దుర్మరణం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Written By Bhoomi
Published: Nov 04, 2026, 09:11 AM IST | Updated: Nov 04, 2026, 09:13 AM IST
Image Credit: Conductor Pravallika
Join

Conductor Pravallika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక దుర్మరణం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రవళికను, సబ్ బస్సులో చిల్లర విషయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ కారణంగా ఒక ప్రయాణికురాలు బయటకు తోసేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయవిదారకమని మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాుల కోల్పోయిన ప్రవళిక కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకు వచ్చింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఒక ఇందిరమ్మ ఇల్లు, రూ. 10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి అధికారికంగా ప్రకటించారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంతో పాటు, ఉద్యోగం అలాగే ఇల్లు మంజూరు చేయడం ద్వారా ఆ కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎంతో కొంత సాంత్వన చేకూరనుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా ఆర్టీసీ బస్సులలో పనిచేసే సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించే దిశగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళిక కుటుంబానికి అన్ని రంగాల నుంచి తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతున్నాయి.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES