Sainik School Admission 2027: దేశ రక్షణ రంగంలో పనిచేయాలని చిన్నప్పటి నుంచే కలలు కనే విద్యార్థులకు గుడ్ న్యూస్. త్రివిధ దళాలకు అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వచ్చే విద్యా సంవత్సరంలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు అర్హులైన ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఎన్టీఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నవంబ్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 3వ నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 11న సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసి.. జనవరి 25న అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉంచుతారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష జనవరి 31న జరుగుతుంది. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని మాత్రం నోటిఫికేషన్ లో ప్రకటించలేదు. 6వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తెలుగు సహా 13 భాషల్లో 150 నిమిషాల పాటు పరీక్షను నిర్వహిస్తారు. 9వ తరగతి ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే 180 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది.
కాగా ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్ఈ అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు. 6వ తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2027 మార్చి 31 నాటికి 10 నుంచి 12ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. బాలికలకు కూడా ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకే విధంగా ఉంటాయి. 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15ఏండ్ల మధ్య ఉండాలి.
ఫీజు విషయానికి వస్తే జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు , ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకు రూ. 850, ఎస్సీ, ఎస్టీలకు రూ. 700ల చొప్పున చెల్లించాలి.
6వ తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు చూసుకుంటే.. లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథ్స్ 50 ప్రశ్నలకు 150 మార్కకులు.. ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
9వ తరగతి అయితే మ్యాథ్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు.. ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు.. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు మొత్తం 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
Also Read: