• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

Rajamouli about Jr NTR: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎప్పుడు వీడియోలో వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక పత వీడియో వైరల్ అవుతూ అందరిని మరింత ఆకట్టుకుంటుంది.

Written ByVishnu Priya
Published: Nov 04, 2026, 09:53 AM IST|Updated: Nov 04, 2026, 09:57 AM IST
joinshare
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సైనికులు కావాలనే మీ పిల్లల కలను సాకారం చేసుకోండిలా.. సైనిక్ స్కూల్స్ ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే..!!

సైనికులు కావాలనే మీ పిల్లల కలను సాకారం చేసుకోండిలా.. సైనిక్ స్కూల్స్ ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే..!!

2

Assam Polygamy Bill Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్..రెండో పెళ్లి చేసుకుంటే ఉద్యోగం పోయినట్టే!

3

Hyderabad students holidays: విద్యార్థులకు 3 రోజుల సెలవులు.. కారణం ఇదే!

4

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

5

ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. నేడు OUలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ ర్యాలీ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఊసరవెల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన సరదా కామెంట్స్ వీడియో. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఈవెంట్ వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆ ఈవెంట్‌లో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఫన్నీగా మాట్లాడారు. సాధారణంగా తారక్ చాలా సింపుల్‌గా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎక్కువగా తెల్ల షర్టు లేదా నల్ల ప్యాంటు మాత్రమే వేసుకొని ఈవెంట్స్‌కు వచ్చేవాడని సరదాగా వ్యాఖ్యానించారు.

కానీ ఆ రోజు మాత్రం ఎన్టీఆర్ స్టైల్ పూర్తిగా మారిపోయిందని రాజమౌళి అన్నారు. “తారక్ ఎప్పుడూ తెల్ల షర్టు, నల్ల ప్యాంటులోనే కనిపిస్తాడు. కానీ ఈ రోజు మాత్రం బ్లూ షర్టు, బ్లూ ప్యాంటుతో చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు” అని చెప్పారు.

రాజమౌళి మాటలకు అక్కడున్నవాళ్లు అందరూ నవ్వేశారు. తర్వాత ఆయన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని ప్రస్తావిస్తూ మరింత సరదాగా మాట్లాడారు. “ఈ మార్పు మొత్తం ప్రణతి వల్లే వచ్చింది. ఆమె సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోకపోతే తిడుతుంది. అందుకే ఇలా వచ్చాడు” అంటూ నవ్వుతూ చెప్పారు.

రాజమౌళి కామెంట్స్ విన్న ఎన్టీఆర్ కూడా నవ్వుతూ కనిపించాడు. ఇప్పుడు ఈ పాత వీడియోను మళ్లీ చూస్తున్న అభిమానులు రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో అభిమానులకు మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

Read More: Radhika Apte: పెద్దవయసు హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్య మూవీపై రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు..

Read More: కొత్త భామలతో కళకళ లాడుతున్న టాలీవుడ్.. బడా ప్రాజెక్ట్స్‌లో యంగ్ బ్యూటీస్.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie