SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Anirudh Reddy: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు

MLA Anirudh Reddy Serious Allegations On Govt Employees Corruption: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకుల కన్నా ప్రభుత్వ అధికారులే అవినీతిపరులని ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం రేపింది. తాను లంచం ఇచ్చి పనులు చేయించుకున్నట్లు చెప్పారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 16, 2026, 22:27 IST | Updated: Nov 16, 2026, 22:41 IST
Image Credit: Source: Anirudh Reddy Facebook
Join

Govt Employees Corruption: సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదని.. ప్రభుత్వ అధికారులే అవినీతిపరులని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులకు తానే లంచం ఇచ్చి పనులు చేసుకున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి తెలిపారు. ఆయన చేసిన ఆరోపణలు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు. జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయంలో వారసత్వ ఆస్తుల బదిలీ కోసం తాను చెప్పినా పని కాలేదని.. చివరకు రూ.15 వేలు ఇస్తేనే పని జరిగిందని ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

'సిమెంట్ రోడ్ల పనుల బిల్లుల ఎంబీ రికార్డుల కోసం 10 నుంచి 20 శాతం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల వేధింపులతో కాంట్రాక్టర్లు పారిపోతున్నారు' అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ఆరోపించారు. అవినీతి అధికారులను శిక్షించే బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ఎంత అభివృద్ధి చేయాలని ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో అధికారుల తీరు మారకపోతే పనులు ఎలా ముందుకు సాగుతాయని అనిరుధ్‌ రెడ్డి ప్రశ్నించారు.

'జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయంలో వారసత్వ ఆస్తుల బదిలీ కోసం నేను చెప్పినా పని జరగలేదు. చివరకు రూ.15 వేలు ఇస్తేనే పని పూర్తయింది' అని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ఆరోపించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల ఎంబీ రికార్డుల కోసం అధికారులు 10 నుంచి 20 శాతం వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికారుల వేధింపులతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు.

తాను రాజకీయాల్లో పదవుల కోసం కాకుండా పని చేయడానికి వచ్చానని.. భవిష్యత్తులో మళ్లీ గెలుస్తామా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి పేర్ఒన్నారు. గతంలో మాదిరిగా తన వెనుక వందల మంది తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేటి జనరేషన్ సోషల్ మీడియా మెసేజ్‌ల ద్వారానే స్పందిస్తోందని, ఈ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తనను సమర్థించారని గుర్తుచేసుకున్నారు.

ప్రభుత్వ అధికారులపై చేసిన ఆరోపణలు ఇవే
జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయంలో వారసత్వ ఆస్తుల బదిలీ కోసం రూ.15 వేలు ఇస్తేనే పని జరిగింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు
సీసీ రోడ్ల పనుల బిల్లుల ఎంబీ రికార్డుల కోసం 10 నుంచి 20 శాతం లంచాలు డిమాండ్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES