SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం పై రాష్ట్ర ప్రభుత్వం DA ఎలా లెక్కిస్తారు..!!

State Employees DA Calculation: ప్రభుత్వ ఉద్యోగులకు.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వినియోగదారుల ధరల సూచీ, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏను సవరిస్తుంది ప్రభుత్వం. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలల్లో ఈ డీఏ పెంపు అనేది జరుగుతుంది.

Written By Bhoomi
Published: Sep 23, 2026, 11:33 AM IST | Updated: Sep 23, 2026, 12:03 PM IST
Image Credit: DA Calculation
Join

State Employees DA Calculation: ప్రభుత్వ ఉద్యోగులకు.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వినియోగదారుల  ధరల సూచీ, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏను సవరిస్తుంది ప్రభుత్వం. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలల్లో ఈ డీఏ పెంపు అనేది జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించే డీఏ శాతానికి.. రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మంజూరు చేసే డీఏ శాతానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం 4 శాతం పెంచితే.. రాష్ట్రంలో అంతకంటే తక్కువ శాతం రావడం వెనక ఉన్న పరిపాలనాపరమైన.. సాంకేతికపరమైన లెక్కలు ఏంటి? కేంద్రం డీఏకు అనుగుణంగా రాష్ట్రం డీఏను న్యూట్రలైజ్ చేసే ఆ కన్వర్షన్ ఫార్ములా కథ ఏంటి.. ఈ ప్రత్యేక కథనం ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పే-రివిజన్ల కాలపరిమితిలో వ్యత్యాసం:
కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వేతన సవరణ  నిర్ణయించే కాలపరిమితిలో ప్రాథమిక తేడా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ  అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి 5 సంవత్సరాలకోసారి వేతన సవరణ ప్రక్రియను చేపడుతోంది. పిఆర్‌సి సవరణ సమయంలో రాష్ట్ర ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ ను విలీనం చేసేటప్పుడు.. కేంద్రం కంటే చాలా ఎక్కువ స్థాయిలో డిఏ ను విలీనం  చేయడం జరుగుతుంది. ఈ కారణం చేతనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ శాతాన్ని నేరుగా రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయడం సాధ్యపడదు. అందుకే, కేంద్రం తన ఉద్యోగులకు ప్రతి 1శాతం డిఏ ప్రకటించినప్పుడు, రాష్ట్ర ఉద్యోగుల డిఏ శాతాన్ని సరిసమానం చేయడానికి వేతన సవరణ కమిషన్లు ప్రత్యేక  కన్వర్షన్ ఫార్ములా ను ఖరారు చేస్తాయి.

9వ వేతన సవరణ ప్రకారం లెక్కింపు: 
తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ (9వ పీఆర్సీ) రికమండేషన్లను పరిశీలిస్తే... 01.01.2006 నాటి కేంద్ర 6వ పిఆర్‌సి అమలయ్యే సమయానికి కేంద్ర వినియోగదారుల ధరల సూచీ 536 పాయింట్లుగా ఉంది. కానీ రాష్ట్రంలో 01.07.2008 నాటి 9వ పిఆర్‌సి ప్రాతిపదికన బేసిక్ పేలో డిఏను విలీనం చేసినప్పుడు ధరల సూచీ 626 పాయింట్లతో సమానమైంది. ఈ రెండింటి నిష్పత్తి ఆధారంగా కమిషన్ 536/626=0.856Fశాతం గా కన్వర్షన్ ఫార్ములాను నిర్ణయించింది. ఈ ఫార్ములా ప్రకారం కేంద్రం ప్రకటించే ప్రతి 1శాతం డిఏ కి గాను రాష్ట్ర ఉద్యోగులకు 0.856శాతం చొప్పున డిఏ ను మంజూరు చేశారు.

10వ పీఆర్సీ 0.524శాతం ఫార్ములా:
పదవ వేతన సవరణ (10th PRC / RPS 2015) వచ్చేసరికి ఈ క్యాలిక్యులేషన్స్ మరింత మారాయి. 01.07.2013 నాటికి 9వ పిఆర్‌సి బేసిక్ పేలో డిఏను కలిపినప్పుడు వినియోగదారుల ధరల సూచీ 1022 పాయింట్లకు 626+(626*63.344శాతం)=1022 చేరుకుంది. దీని ఆధారంగా 10వ పిఆర్‌సి కమిషన్ 536జ/1022=0.524శాతంగా కన్వర్షన్ ఫార్ములాను ఖరారు చేసింది. అంటే..కేంద్ర ఉద్యోగులకు లభించే ప్రతి 1శాతం డిఏ పెంపునకు గాను, రాష్ట్ర ఉద్యోగులకు 0.524శాతం చొప్పున మాత్రమే డిఏ పెరుగుతుంది. ఈ ఫార్ములా 10వ పిఆర్‌సి ఆర్థిక లబ్ధి తేదీ అయిన 01.02.2015 నుండి తదుపరి వేతన సవరణ అమలులోకి వచ్చే వరకు అమల్లో ఉంటుంది.

కేంద్ర 6వ పిఆర్‌సి ప్రాతిపదికగానే రాష్ట్ర డిఏ లెక్కింపు:
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 01.01.2016 నుండి 7వ పిఆర్‌సి ని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ, మన రాష్ట్ర డిఏ ఫార్ములాను మాత్రం కేంద్ర 6వ పిఆర్‌సి ప్రాతిపదికన సవరించే డిఏ ఆధారంగానే లెక్కిస్తారు.

ఉదాహరణ 1 (01.07.2016): కేంద్ర ప్రభుత్వం 6వ పిఆర్‌సి ఉద్యోగులకు 7శాతం డిఏ ప్రకటించగా, రాష్ట్ర ఉద్యోగులకు అది 7శాతం *0.524= 3.668శాతంగా మంజూరైంది.  

ఉదాహరణ 2 (01.01.2017): కేంద్రం 6వ పిఆర్‌సి పై 4శాతం డిఏ పెంచగా, రాష్ట్ర ఉద్యోగులకు అది 4శాతం*0.524=2.096శాతంగా అమలైంది.

ఇదీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లెక్కింపు వెనుక ఉన్న సాంకేతిక.. ఆర్థిక సూత్రం. ఈ కన్వర్షన్ ఫార్ములా ఆధారంగానే ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను విద్యా, ఆర్థిక శాఖల సాంకేతిక కమిటీలు నిర్ధారిస్తాయి.

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES