• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Danam Nagender: రెచ్చిపోయిన దానం నాగేందర్.. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Danam Nagender: రెచ్చిపోయిన దానం నాగేందర్.. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Danam nagender fires on Election commission: ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందంటూ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 01, 2026, 02:21 PM IST|Updated: Oct 01, 2026, 02:32 PM IST
joinshare
Danam Nagender: రెచ్చిపోయిన దానం నాగేందర్.. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
Image Credit: danamnagender(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Danam nagender sensational comments on Hyderabad election commission office:
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నికల అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టే విధించాలని దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో అన్నిపార్టీలు కూడా ఈసీ షెడ్యుల్ ను ఎప్పుడు ప్రకటిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి. 

 

హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం

దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుంది 

ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కలిసి మా ఓట్లు తీయించారు.. ఎన్నికల కమిషన్… pic.twitter.com/I8N2u6BRHB

— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026

 

పలువురు నేతలు తామే బరిలో ఉంటామని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ లో మరల తానే పాగా వేస్తానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. కానీ ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారో మాత్రం చెప్పలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన గెలిచేది తాననంటూ ధీమా వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో  దానం నాగేందర్ తాజాగా.. కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ముఖ్యంగా సర్ ప్రక్రియతో హిమాయత్ నగర్ డివిజన్ లో ఏకంగా 20 వేల ఓట్లను తొలగించారంటూ చెప్పుకొచ్చారు. 

ఎన్నికల కమిషన్ ఈసీతో కుమ్మక్కై మరీ ఓట్ల చోరీకి పాల్పడిందని మండిపడ్డారు. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తగిన విధంగా చర్యలు తీసుకొకపోతే నిరసనలను తీవ్రతరం చేస్తామని దానం నాగేందర్ తెల్చి చెప్పారు. ఇక అన్ని పార్టీలు కూడా ఖైరతాబాద్  ఉపఎన్నికలో ఎలాగైన పాగా వేయాలని పావులు కదుపుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News