• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

TGSRTC New Rules: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి, విధులు నిర్వహించే సిబ్బందికి భద్రత కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికుల కోసం బస్సులో ప్రత్యేకంగా తలుపులు ఏర్పాటు చేయనుంది. అవి పూర్తిగా మూసిన తర్వాతే ముందుకు కదలాలని తేల్చి చెప్పింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 08:00 AM IST|Updated: Nov 06, 2026, 08:01 AM IST
joinshare
బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..
Image Credit: Telangana RTC New Rules (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రతి ఇంటా దరఖాస్తులు! నవంబర్ 19 నుంచి ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా పథకం!

ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రతి ఇంటా దరఖాస్తులు! నవంబర్ 19 నుంచి ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా పథకం!

2

‘రామాయణ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. మొదటి రోజు ఎంత రాబట్టచ్చంటే..

3

బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

4

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

5

మొన్న అర్నబ్.. నిన్న మురసు .. ఏపీని నిండా ముంచి తుపానులు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TGSRTC: బస్సు ప్రయాణంలో ఉన్నంతసేపు డోర్లు తెరిచి ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇటీవల విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కదులుతున్న బస్సు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో అక్టోబర్ 25వ తేదీన ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల గుండ్ల ప్రవళిక.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళతో టికెట్, చిల్లర డబ్బుల విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికురాలు ప్రవళికను కదులుతున్న బస్సు నుంచి కిందకు తోసినట్లు పోలీసులు వెల్లడించారు.

దీంతో బస్సు వెనుక చక్రాల కింద పడిన ప్రవళిక రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా  భద్రాచలంలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సుమారు 10 రోజుల పాటు చికిత్స పొందిన ఆమె నవంబర్ 3వ తేదీన కన్నుమూశారు. ఈ ఘటన ఆర్టీసీ సిబ్బంది భద్రతపై ఆందోళనకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది.

ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం తాజాగా అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. అన్ని డిప్యూటీ రీజినల్ మేనేజర్లు తమ పరిధిలోని బస్సుల్లో ప్రయాణికుల తలుపుల పనితీరును తనిఖీ చేయాలని ఆదేశించింది. డోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా.. వాటిని సులభంగా తెరవడం, మూసివేయడం సాధ్యమవుతోందా అనే అంశాలను పరిశీలించాలన్నారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించింది. ముఖ్యంగా డోర్లు అమర్చిన బస్సుల్లో అవి పూర్తిగా మూసిన తర్వాతే డ్రైవర్లు వాహనాలను నడపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ సమయంలో తలుపులు తెరుచుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపింది. ఈ నిబంధన రాష్ట్రంలోని అన్ని బస్సులకు వర్తిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి స్లీపర్ వంటి ప్రయాణికుల తలుపులు కలిగిన బస్సులకు వర్తిస్తుందని పేర్కొంది. అయితే.. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని సర్వీసుల్లో ప్రత్యేక ప్రయాణికుల డోర్లు ఉండవు. కాబట్టి కొత్త ఆదేశాలు డోర్లు అమర్చిన బస్సులకే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ దాదాపు 9,900 బస్సులతో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన బస్సులతో పాటు అద్దె, ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ అందుబాటులో ఉన్న తలుపుల పనితీరును పరిశీలించాల్సి ఏమైనా బాకాలేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్న్నారు.  ప్రయాణికులు ఎక్కడం, దిగడం పూర్తి అయిన తర్వాత తలుపులు మూసి ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తమ పరిధిలోని బస్సుల తనిఖీ వివరాలు, తలుపుల పనితీరు, కొత్త నిబంధనల అమలు పరిస్థితిపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈనెల 7వ తేదీ లోగా ఈ రిపోర్టులను మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి పంపాలని  సూచనలు చేసింది. రీజినల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, డిపో గ్యారేజ్ ఇంఛార్జీలకు కూడా ఈ ఆదేశాలు చేరాయి. ప్రవళిక మృతి ఘటన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంతో బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఆర్టీసీ దృష్టి సారించింది. తలుపులు సరిగా పనిచేయడం, ప్రయాణ సమయంలో అవి మూసి ఉండేలా చూడటం ద్వారా ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదాల ముప్పును తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Trending News