• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

Janasena 100 Persant Strike Rate in AP Local Body Election:  2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బరిలోకి దిగిన జనసేన.. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది! అంతేకాదు, పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్‌తో దేశ రాజకీయ వర్గాల చూపును తనవైపు తిప్పుకుంది. ఇటీవల వెలువడిన ఏపీ స్థానిక పురపాలక ఎన్నికల్లోనూ జనసేన అదే జోరును రిపీట్ చేసింది. పోటీ చేసిన మొత్తం 20 స్థానాల్లోనూఅంటే విజయవాడ, ఏలూరు లాంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీల్లో జనసేన అభ్యర్థులే 100% విజయం సాధించారు. చివరికి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనూ తమ పట్టును ఘనంగా చాటుకున్నారు. కూటమి అభ్యర్థుల విజయంలోనూ కీలక పాత్ర పోషించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 06:27 AM IST|Updated: Nov 06, 2026, 06:28 AM IST
joinshare
ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..
Image Credit: Janasena 100% Strike Rate (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

2

ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన మరో అసాధారణ విజయం..

3

మొన్న అర్నబ్.. నిన్న మురసు .. ఏపీని నిండా ముంచి తుపానులు..

4

స్త్రీలు చెడు అలవాట్లున్న మగవాళ్లనే ఎందుకు ఇష్టపడుతారు.. చాణక్య నీతి చెబుతున్న కఠోర వాస్తవాలు ఇదే..

5

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు.. ఖంగుతిన్న ట్రంప్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Janasena 100 Persant Strike Rate in AP Local Body Election:  2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బరిలోకి దిగిన జనసేన.. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది! అంతేకాదు, పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్‌తో దేశ రాజకీయ వర్గాల చూపును తనవైపు తిప్పుకుంది. ఇటీవల వెలువడిన ఏపీ స్థానిక పురపాలక ఎన్నికల్లోనూ జనసేన అదే జోరును రిపీట్ చేసింది. పోటీ చేసిన మొత్తం 20 స్థానాల్లోనూఅంటే విజయవాడ, ఏలూరు లాంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీల్లో జనసేన అభ్యర్థులే 100% విజయం సాధించారు. చివరికి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనూ తమ పట్టును ఘనంగా చాటుకున్నారు. కూటమి అభ్యర్థుల విజయంలోనూ కీలక పాత్ర పోషించింది.

ఏపీ పురపాలక ఎన్నికల్లో జనసేన పార్టీ సెన్సేషన్.. 
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రజావిశ్వాసం ఉంటే… ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధిస్తామని నిరూపించింది. పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ బంపర్ మెజారిటీతో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినట్లే వందశాతం స్ట్రైక్ రేట్ నమోదుచేసి ప్రజావిశ్వాసం చెక్కుచెదరలేదని రుజువుచేశారు.

రాజకీయ అవసరాలకోసం తెలుగుదేశంపార్టీ, బీజేపీలతో జతకట్టిన జనసేన ప్రజా మద్ధతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఎక్కడపోటీ చేసినా… తనకు తానుగా విజయం సాధించడంతోపాటు.. మిత్రపక్షాల విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపాలక పంచాయతీలను రికార్డు స్థాయిలో కైవసం చేసుకున్నారు.

ప్రాతినిథ్యం లేని విజయవాడలో విజయ దుంధుభి.. 

విజయవాడలో జనసేనకు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించేలా మేయర్‌ స్థానానికి పోటీ చేసి సత్తా చాటుకుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను బరిలో నిలిపి క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపింది. ఏలూరు కార్పొరేషన్, శ్రీకాకుళంలోనూ కొత్తగా విస్తరించేలా పొత్తు కుదుర్చుకుంది. తుని, పెద్దాపురం, దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, అమలాపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ పార్టీని విస్తరించేలా స్థానాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లి విశ్వాసాన్ని పెంపొందించింది.

ఏలూరు మేయర్ పీఠం జనసేనకు దక్కగా, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతో రెడ్డి అప్పలనాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు.  జనసేన అభ్యర్థి అప్పలనాయుడు 44వేల 665 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. టీడీపీ-35, జనసేన-13, బీజేపీ-3 మరియు వైయస్సార్సీపీ 3 డివిజన్లలో విజయం సాధించాయి.

జనసేన నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో పోటీ చేసింది. ఇందులో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో  గెలుపు సాధించింది. పోటీ చేసిన అన్ని చోట్లా జయకేతనం ఎగురవేసి తిరుగులేని రికార్డు సృష్టించింది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభంజనం సృష్టించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని జనసేన అభ్యర్థి దాణం లాజర్ బాబు 9వేల 235 ఓట్ల భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. ఇక్కడ 33 వార్డులకు గాను జనసేన 19 స్థానాలను కైవసం చేసుకుంది.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని రెండు మున్సిపాలిటీలు సహా, ప్రస్తుతం పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా పలు స్థానాలను కేటాయించుకుంది. కొత్త ప్రాంతాలకు సైతం పార్టీని విస్తరించే వ్యూహంలో భాగంగా మరికొన్ని స్థానాలను ఎంచుకుని అందులోనూ ఘనవిజయం సాధించింది.

కృష్ణా జిల్లా  పెడన మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి జ్యోత్స ఘనవిజయం సాధించారు. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లతో పాటు కేటాయించిన స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి ప్రధాన కార్పొరేషన్లు, పట్టణ కేంద్రాల్లో జనసేన బలమైన శక్తిగా అవతరించి కూటమి విజయంలో కీరోల్ పోషించింది. ఆదోని మున్సిపాలిటీలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానం టీడీపీకి వెళ్లడంతో, జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వప్న మల్లప్ప నాయకర్ స్వతంత్రురాలిగా గెలుపొంది చైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల నుంచి జనసేనలోకి వచ్చిన కీలక నేతలకు కూడా పార్టీ కొన్ని చోట్ల పోటీకి అవకాశం కల్పించింది. కొత్త నియోజకవర్గాలకు పార్టీని విస్తరించేందుకు ఈ మున్సిపల్ ఎన్నికలను జనసేన సమర్థవంతంగా వినియోగించుకుంది. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో నాయకత్వాన్ని పెంచేలా జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి అన్నిచోట్లా గెలుపొందిన జనసేన, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపుతో గెలుపు రికార్డును సొంతం చేసుకోవడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని రెట్టింపు చేసింది.

ఎన్నికలు ఏవైనా సరే… ప్రజావిశ్వాసంతో తిరుగులేని విజయాలు సాధిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో విశ్వాసాన్ని మున్సిపల్ ఎన్నికలు బలోపేతంచేశాయి. పార్టీని ప్రారంభించిన కొత్తల్లో ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన..  ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలైన తర్వాత… టీడీపీతో జతకట్టి తిరుగులేని శక్తిగా రాణిస్తోంది. రాజకీయాల్లో కింగ్ మేకర్లను తయారు చేయడమేకాదు.. నమ్మినవారిని రారాజులం చేస్తామని జనసేన నిరూపిస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Andhra Pradesh
Elections
Pawan Kalyan
TDP