Nalgonda: నల్గొండలో షాకింగ్.. దేవీ నవరాత్రుల వేళ పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. వీడియో..
Durga idol immersion in Nalgonda: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది కాస్త ముదిర తీవ్ర వాగ్వాదం, ఘర్షణకు దారితీసింది. దీంతో స్థానికులు దేవీ శరన్నవరాత్రులు నిర్వహించకుండానే తీసుకున్న నిర్ణయంను భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నల్గొండలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Durga idol immersion with out Navratri puja rituals in nalgonda: దేశ వ్యాప్తంగా దుర్గమాత శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. అంతే కాకుండా తొమ్మిది రోజుల పాటు దుర్గమాత విగ్రహాలను మండపాలలో ప్రతిష్టాపన చేసుకుని రోజు రెండు వేళల పూజలు చేస్తు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మది అవతారాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో దేవీ నవరాత్రుల వేళ అనుకొని ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దుర్గనవరాత్రుల వేళ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అది కాస్త ముదిరింది. ఎవరు కూడా వెనక్కు తగ్గక పోవడంతో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన విషయంలో రచ్చ నెలకొంది.
స్థానికులు దుర్గమాత విగ్రహంను ప్రతిష్టాపనకు ముందే నిమజ్జనం చేశారు. దీంతో అమ్మవారి విగ్రహం పూజలకు నోచుకొక పోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ప్రతిష్టాపన విషయంలో రాజకీయాలు ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటన నవరాత్రుల వేళ వార్తలలో నిలిచింది.