SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైతులకు అలర్ట్.. నాలుగేళ్ల పాటు ఎల్‌నినో ఎఫెక్ట్? యాసంగి వరి సాగుపై పోచారం కీలక సూచనలు!

El Nino Impact: మరో నాలుగు సంవత్సరాల పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా తగిన ఏర్పాటు చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 06:02 PM IST | Updated: Oct 01, 2026, 06:03 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

El Nino Impact Telugu News: రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులతో పాటు ముఖ్యంగా  ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని.. కావున రైతాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. యాసంగి వరి సాగు విషయంలో రైతులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడినట్లు తెలుస్తోంది..

నాలుగేళ్ల పాటు ఎల్‌నినో ఎఫెక్ట్‌..
వాతావరణ శాస్త్రవేత్తల అందించిన సమాచారం ప్రకారం.. రాబోయే నాలుగు ఏళ్ల పాటు ఎల్‌నినో ప్రభావం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని పోచారం వెల్లడించారు. దీనివల్ల సాధారణ వర్షపాతం గణనీయంగా తగ్గి.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు కూడా పడిపోవచ్చని.. ఇదే సమయంలో విద్యుత్ కొరత కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

నీరు ఎక్కువగా అవసరమయ్యే.. రెండో పంట వరి సాగు చేసే విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నీటి లభ్యతతో పాటు భవిష్యత్తులో ఏర్పడే పరిస్థితులు.. విద్యుత్ సరఫరా అంశాలను ముందస్తుగానే అంచనా వేసుకోవాలన్నారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు వీలుగా ఆరుతడి పంటలు.. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. పంటల ప్రణాళికను సరిగ్గా వేసుకోకపోతే చివర్లో తీవ్ర నష్టాలు రావచ్చని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోచారం ఆదేశించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేయాలన్నారు. అలాగే తేమ శాతంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రైతులకు తగిన సలహాలు ఇవ్వాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. రైతుల ఖాతాల్లోకి సకాలంలో నిధులు చేరేలా చూడాలని పోచారం తెలిపారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES