Fire accident at monarch kids school in Saidabad: హైదరాబాద్ లో ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫైర్ సెఫ్టీ సూచనలు పాటించాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకొవాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్న కూడా కొంత మంది పూర్తిగా నెగ్లెజెన్సీగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో సైఫాబాద్ పరిధిలోని మాదన్నపేట న్యూ రోడ్ శ్రీనగర్ కాలనీలోని మోనార్క్ కిడ్స్ స్కూల్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా స్కూల్ లో మంటలు వ్యాపించాయి.
సైదాబాద్‌లో స్కూల్‌లో అగ్నిప్రమాదం
మదన్నపేట న్యూ రోడ్ శ్రీనగర్ కాలనీలోని మోనార్క్ కిడ్స్ స్కూల్‌లో మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.
మలక్‌పేట ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం జరగలేదు. కొన్ని సామగ్రి మాత్రమే దగ్ధమైంది.… pic.twitter.com/ryC8SZdqQU— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 16, 2026
దీంతో చుట్టుపక్కల వారు స్కూల్ సిబ్బందికి, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. మంటలు ఎగిసి పడి మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. సమాచారంలో అందుకొగానే మలక్‌పేట ఫైర్ సిబ్బంది రంగంలొకి దిగారు . కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
రాత్రి పూట ప్రమాదం జరగడంతో, పిల్లలు, సిబ్బంది ఎవరు లేకపొవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అగ్ని ప్రమాదంలో కిడ్స్ స్కూల్ కు చెందిన కొంత సామగ్రి మాత్రమే దగ్ధమైంది. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.