SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KCR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అసలు కారణం ఇదేనా..?..

Kcr performed yagam in erravalli: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించారు. అయితే ఈ యాగంలో గతంలో పూజలు, హోమాలు చేసిన పండితులు కాకుండా కొత్తవారు కన్పించారు.

Written By Inamdar Paresh
Published: Oct 07, 2026, 01:19 PM IST | Updated: Oct 07, 2026, 01:33 PM IST
Image Credit: kcrperformedyagaminmedakpicviral
Join

Former CM Kcr performed yagam erravalli farm house: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం నడుస్తొంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ టార్గెట్ గా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటీవల విడుదలన నాని ప్యారడైజ్ లో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను పోలిన ఒక రోల్ ఉంది. అది కూడా కేవడం 4 నిముషాలు మాత్రమే ఉంది. దీన్ని ప్రియదర్శి వేశాడు.  అయితే.. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జై కేసీఆర్ అంటూ థియేటర్లతో నినాదాలు చేశారు. 

 

 

కేటీఆర్ దీనిపై కూడా సీఎం రేవంత్ పై సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ తరచుగా హోమాలు నిర్వహిస్తారు. ఆయన గతంలొ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పలు మార్లు  చండీయాగం, రాజశ్యామల యాగాలను నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ మరల  ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మరల యాగం నిర్వహించడం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో హోమం, పూజా కార్కక్రమాలు నిర్వహించారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తరచుగా కేసీఆర్ పై అక్రమంగా భూములు దొచుకున్నారని ఆరోపణలు చేశారు. అంతే కాకుండా  ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాలలో అనేక అసైన్డ్ భూములున్నాయని విమర్శలు చేశారు. 

ఈ క్రమంలో కేసీఆర్ యాగం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఈ హోమంలో ప్రతిసారి కన్పించే  పండితులు కాకుండా కొత్త వారు కన్పించారు. వారు ప్రత్యేకంగా వేదాశీర్వచనాలు కేసీఆర్ ఆయన సతీమణి శోభకు అందజేశారు.ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారింది. అసలు ఈ యాగం ఎందుకు నిర్వహించారో విషయం బైటకు రాలేదు. 

కానీ కొంత మంది నెటిజన్లు మాత్రం  ఇటీవల కాంగ్రెస్ నేతలు కొంత మంది తరచుగా కేసీఆర్ చచ్చిపొవాలని కోరుకుంటున్న నేపథ్యంలో  ఈయాగం ఆయురారోగ్యాల కోసం నిర్వహించుకున్నారని ప్రచారం జరుగుతుంది. మరి కొంత మంది మాత్రం.. రైతు బిడ్డ, తెలంగాణ పెద్దాయన ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES